ఛత్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి

Wed,February 20, 2019 01:25 AM

-ఆరె సంఘం జిల్లా అధ్యక్షుడు డుబ్బుల నానయ్య
-నియోజకవర్గంలో ఘనంగా శివాజీ జయంతి
చింతలమానేపల్లి: ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డుబ్బుల నానయ్య, కోనేరు ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జెండా ఎగరవేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా హక్కులు అందించిన ఘనత ఛత్రపతి శివాజికే దక్కుతుందన్నారు కార్యక్షికమంలో ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డుబ్బుల వెంకన్న, ఆరె సంఘం మండల అధ్యక్షుడు భీంకరి నారాయణ, ఆరె కులస్తులు మారుతి, ఎల్ములె మల్లయ్య, శ్రీమన్నారాయణ, చౌదరి రాజన్న, డోకె రాజన్న, కులస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఆయా గ్రామాల్లోనూ ఘనంగా జరిగాయి.

దహెగాం: మండలవ్యాప్తంగా శివాజీ జయంతిని మంగళవా రం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రం తో పాటు రాళ్లగూడలో ఆరె కులస్తులు శివాజీ విగ్రహనికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. అనంతరం జెం డావిష్కరణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ లావు డె సుజాత, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఆరె కుల సంక్షేమ సం ఘం ఉపాధ్యక్షుడు అల్గం మల్లేశ్, తాలుకా ఉపాధ్యక్షుడు చప్పిడ బక్కయ్య, మండలాధ్యక్షుడు తుమ్మిడ నారాయణ, బుడిపల్లి ప్రకాశ్, తుమ్మిడ సత్యనారాయణ, బుడిపల్లి వెంకన్న, తుమ్మిడ దామోదర్, తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్(టి) : మండల కేంద్రంతో పాటు దుబ్బగూడ, నవే గాం, వెంకవూటావ్‌పేట్, టోంకిని, లోన గ్రామాల్లో శివాజీ జయంతిని నిర్వహించారు. బస్టాండ్, డౌనల్ ప్రాంతాల్లో ఆరె కుల సంఘం నాయకులు శివాజీ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం శివాజీ జెండాను ఆవిష్కరించారు. ఆరె కుల సంఘం మండలాధ్యక్షుడు చౌ దరి నానాజీ, యా దవ సంఘం మండలాధ్యక్షుడు నర్గేవార్ శంకర్, సంఘం నాయకులు తుస్సే సంతోష్, లాలాజీ, కిశోర్, సంతోష్, ఆశీక్‌హుస్సేన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

బెజ్జూర్ : మండల కేంద్రంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శివాజీ జయంతికి ఎస్‌ఐ రాజేశ్వర్ ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మొగలు సామ్రాజ్యం ఆధీనంలో ఉన్న భారతీయులను ఏక తాటిపై తీసుకొచ్చిన వారిలో శివాజీ ప్రముఖడని పేర్కొన్నారు. అంతకు ముందు ఆరె కుల సంఘం మండలాధ్యక్షుడు బుజాడి సత్తయ్య జెండాను ఆవిష్కరించారు. డీటీ రవీందర్, మండల రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు అర్షద్ హుస్సేన్, ఆరెకుల సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్కరి అంకులు, సర్పంచులు బుజాడి శేఖర్, తంలడి తిరుపతి, నాయకులు లంగారి శ్రీనివాస్, దందెర ఇస్తారి, డోకె మహేశ్, విలాస్, రంగేశ్, జావీద్ అలీఖాన్, ఆయా గ్రామాల నుండి వచ్చిన కులస్తులు పాల్గొన్నారు.

పెంచికల్‌పేట్ : శివాజీ చూపిన మార్గంలో నడవాలని తా లూకా ఆరె సంఘం అధ్యక్షుడు చప్పిడె సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోనూ శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎల్కపల్లిలో జునుగరి మధూకర్, పెంచికల్‌పేట్‌లో రౌతు తిరుపతి, ఎల్లూర్‌లో సామర తోగయ్య, అంగన్‌గూడలో తుమ్మిడె అంజన్న, కొండపల్లిలో ఉపాసి సత్తన్న, జైహింద్‌పూర్‌లో రైతు ప్రకాశ్, బొంబాయిగూడలో పొట్టెమల్లయ్య, మొట్లగూడలో చౌదరి సుధాకర్, పోతెపల్లిలో బాపూజీ, చేడ్వాయిలో లొకండి మాధవ్, కొత్తగూడెంలో తుమ్మిడె వసంత్ జెండాలను ఎగరవేశారు. ఆరె కులస్తులు, సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles