ఛత్రపతి గొప్ప చరిత్రకారుడు

Tue,February 19, 2019 01:37 AM

-ఆయన ఆశయాలను కొనసాగిద్దాం
-సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-దహెగాంలో శివాజీ విగ్రహావిష్కరణ
దహెగాం : హిందూ ధర్మ స్థాపకుడు, పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ గొప్ప చరిత్ర కారుడని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఆరే సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మస్థాపన కోసం శివాజీ ఎంతో కృషిచేశాడన్నారు. శివాజీ గొప్ప ఆదర్శప్రాయుడనీ, ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ఇప్పటికే సీఎం కేసీఆర్‌తో చర్చించిచినట్లు చెప్పారు. ఆరె కుల సంక్షేమ సంఘ భవన నిర్మాణానికి హైదరాబాద్‌లో ప్రభుత్వం ఎకరం స్థలంతో పాటు రూ.కోటి మంజూరు చేసిందన్నారు. కాగజ్‌నగర్‌లో కూడా ఆరె కుల కమ్యూనిటీ హాలుకు స్థలంతో పాటు రూ.50లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మరో రూ.30లక్షలు అందించనున్నట్లు చెప్పారు.

విద్యావంతులైన ఆరె కులస్తులు నిరుద్యోగులై ఉండి ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల నడిపించేందుకు ముందుకు వస్తే ముం జంపల్లి-ఆరెగూడ గ్రామల మధ్య రెండెకరాల స్థలం అందించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఆరె కులస్తులకు వ్యవసాయ రంగంలో ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఆ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెట్టుపల్లి శివాజీ మాట్లాడుతూ.. ఎన్నో వ్యయప్రాయాసాలను ఓర్చి మా రుమూల మండలకేంద్రంలో గొప్ప మహనీయుడు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆరె కుల యువకులు సేవారంగంలో ముందుండి ఆదర్శంగా నిలువాలని సూచించారు. ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డు బ్బుల నానయ్య, కార్యదర్శి డుబ్బుల వెంకన్న, ఉపాధ్యక్షుడు అల్గం మల్లేశ్, తాలుకా అధ్యక్షుడు చప్పిడ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు బక్కయ్య, సర్పంచ్ పుప్పాల లక్ష్మి, ఉప సర్పంచ్ ప్రశాంత్, ఆరె సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు నారాయణ, ఆత్మా చైర్మన్ కొమురాగౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు సత్యనారాయణ, నాయకులు వాసు పటేల్, ప్రకాశ్, వెంకన్న, తిరుపతి, తుమ్మిడ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles