రెండో విడతకు రెడీ..

Sun,February 17, 2019 02:42 AM

-గొర్రెల పంపిణీకి అధికారుల సన్నద్ధం
-2192 యూనిట్లు అందించేందుకు ఏర్పాట్లు
-మూడు నెలల్లోగా ప్రక్రియ పూర్తికి చర్యలు
-మొదటి విడతలో రాష్ట్రంలో జిల్లాకు రెండో స్థానం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :జిల్లాలో గొల్ల కుర్మల కుటుంబాలను బట్టి ప్రభుత్వం యూనిట్లు కేటాయించింది. మొదటి విడతలో 2215 మంది గొర్రెలను పంపిణీ చేయగా, రెండో వి డతలో మిగతా లబ్ధిదారులకు అందించేందుకు చర్య లు తీసుకుంటున్నారు. మొదటి విడతలోనే రెండు విడతలకు సంబంధించిన అర్హులను లక్కీ లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జిల్లాలో 4,407 మంది లబ్ధిదారులను గుర్తించారు. లబ్ధిదారులకు ఒక్కో యూని ట్ పంపిణీ చేస్తారు. రూ. 1.25 లక్షల విలువైన 20 గొర్రెలు, ఒక్క పొట్టేలుతో కలిపి 21 గొర్రెలను పంపి ణీ చేశారు. ప్రభుత్వం 75 శాతం భరిస్తుండగా, మి గితా 25 శాతం డబ్బులను లబ్ధిదారులు చెల్లిస్తున్నా రు. మొదటి విడతలో మొత్తంగా రూ. 26 కోట్లతో 2215 యూనిట్లు పంపిణీ చేశారు. అదే స్ఫూర్తితో జి ల్లాలో రెండో విడతలో 2191 యూనిట్లు అందించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జిల్లా యం త్రాంగం ఏర్పాట్లతో నిమగ్నమైనది.

మూడు నెలల్లో పూర్తయ్యేలా..
రెండో విడత గొర్రెల పంపిణీని మూడు నెలల్లోగా పూ ర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. రెండో విడతలో 2192 యూనిట్లను పంపిణీ చే యాల్సి ఉండగా, ఇప్పటికే 180 యూనిట్లు కొనుగో లు చేసి లబ్ధిదారులకు అందించారు. మిగతా లబ్ధిదారులకు మూడు నెలల్లోగా పూర్తిస్థాయిలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని మండలాల లబ్ధిదారులు ఒకేసారి గొర్రెల కొనుగోలుకు వెళ్లకుండా.. క్రమానుసారంగా తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల నుంచి డీడీలు కట్టిన వారు ఒక్కో మండలం నుంచి 4 నుంచి 6 యూనిట్ల గొర్రెల కొనుగోలుకు వెళ్లేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

మొదటి విడతలో సత్ఫలితాలు
జిల్లాలో మొదటి విడతలో చేపట్టిన గొర్రెల పంపిణీ మంచి ఫలితాలను ఇచ్చింది. జిల్లాలో 2215 యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. 22 వేల పిల్లులు ఎదగ్గా, రూ. 16 కోట్ల మేర ఆదాయం సమకూరిన ట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో చేపట్టిన గొర్రెల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రలోని ఎనిమిది జిల్లాలకు వెళ్లి గొర్రెలను పరిశీలించి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కలెక్టర్‌తో సహా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ఈ పక్రియను పరిశీలించడంతోనే జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles