జడ్పీ విభజన మొదలైంది

Sun,February 17, 2019 02:40 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎక్కువ విస్తీర్ణంలో ఉం డడంతో పరిపాలనా సౌలభ్యం కోసం 2016 అక్టోబ ర్ 11న నాలుగు జిల్లాలుగా విభజించారు. జిల్లాల విభజన జరిగినప్పటికీ.. జిల్లా పరిషత్ మాత్రం ఉమ్మడిగానే కొనసాగుతోంది. తాజాగా ఉమ్మడి జిల్లా పరిషత్ పాలకవర్గానికి గడువు సమీపిస్తుండడంతో జడ్పీ విభజనపై ప్రభుత్వం దృష్టి సారించింది. నాలుగు రెవె న్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌లకు ఏర్పాటు చే సేందుకు అవసరమైన చర్యలు చేపడుతోంది. రెవె న్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసేందుకుగాను.. ఈ నెల 25లోగా ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఉమ్మడి జిల్లా పరిషత్తు సీఈవోను ఆదేశించింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో ప్రస్తుతం జిల్లా పరిషత్తు కార్యాలయం ఉండ గా.. కొత్తగా మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలకు కొత్త జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చే స్తున్నారు. నాలుగు జిల్లాల్లో మండలాల వారీగా జనాభా, కొత్త మండలాలు, పాత మండలాల వివరాలను ఈనెల 25లోగా జడ్పీ అధికారులు ప్రభుత్వానికి నివేదించనున్నారు.

2014లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉండగా.. మొత్తం 52మండలాలు ఉండేవి. 2014ఏప్రిల్ జడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించగా.. 2014, జూలై 5న జడ్పీ పాలక వర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది మేలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ జిల్లాల ప్రకారం జిల్లా పరిషత్‌ల ఏర్పాటు చేయనున్నారు. గతంలో 52మండలాలు ఉండగా.. కొత్తగా 18మండలాలు ఏర్పాటు చేయటంతో వీటి సంఖ్య 70కి చేరింది. నిర్మల్ జి ల్లాలో 19మండలాలు, ఆదిలాబాద్‌లో 18, మంచిర్యాలలో 18, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15మండలాలున్నాయి. మొత్తం నాలుగు అర్భన్ మండలాలు, 66గ్రామీణ మండలాలున్నాయి. మంచిర్యాల జి ల్లాలో రెండు, నిర్మల్, ఆదిలాబాద్‌లో ఒక్కో అర్బన్ మండలాలున్నాయి. నిర్మల్ జిల్లాలో 18గ్రామీణ మండలాలు, ఆదిలాబాద్‌లో 17, మంచిర్యాలలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15చొప్పున ఉన్నా యి. కొత్తగా ఏర్పాటు చేసిన 14 గ్రామీణ మండలా లు రెవెన్యూ మండలాలుగా కొనసాగుతుండగా.. పం చాయతీ రాజ్ శాఖ గుర్తింపు లేదు. వీటికి తాజాగా పంచాయతీరాజ్ మండలాలుగా గుర్తించి.. ఎంపీడీఓ కార్యాలయాలు పెట్టి ఎంపీడీఓలను నియమిస్తారు. కొత్త, పాత మండలాలకు తాజాగా ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు.

మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యు ల్ వచ్చే అవకాశం ఉన్నందున ఆలోపే జిల్లా పరిషత్ విభజనతో పాటు కొత్త మండలాలకు పంచాయతీరా జ్ మండలాలుగా మార్పు చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో 634ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఒక ఎంపీటీసీ స్థానానికి 3వేల నుంచి 4వేల మంది జనాభాను ప్రామాణికంగా తీసుకోగా.. సగటున 3500మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాల సేకరణలో ఎంపీడీఓలు నిమగ్నమయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఎంపీటీ సీ స్థానాలపై కసరత్తు మొదలెట్టారు. శనివారం రోజు న ఎంపీడీఓలతో జడ్పీ సీఈఓ జితేందర్‌రెడ్డి వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎంపీటీసీ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మండల మొత్తం జనాభాను 3,500తో భాగించి ఆ లెక్క ప్రకా రం ఎంపీటీసీ స్థానాలను నిర్ణయిస్తారు. ఎంపీటీసీ స్థా నాలపై ఎంపీడీఓలు కసరత్తు వేగవంతం చేయగా.. మంగళవారం నాటికి జిల్లాల వారీగా ఎంపీటీసీ స్థానాల సంఖ్యపై స్పష్టత రానుంది. ఉమ్మడి జిల్లాలో 70 మండలాలుండగా.. 66గ్రామీణ మండలాల్లో ఎంపీటీసీ స్థానాలపై కసరత్తు చేస్తున్నారు.

గతంలో 634 ఎంపీటీసీ స్థానాలుండగా.. తాజా గా వీటి సంఖ్య 100 వరకు తగ్గే అవకాశాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, నిర్మల్ జిల్లాలో ఒకటి, ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. జిల్లాలోని చాలా గ్రామాలు ఈ మున్సిపాలిటీల్లో విలీనం చేయగా.. దీంతో జిల్లాలో 100వరకు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశాలున్నాయి. మంచిర్యాల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన చెన్నూర్ మున్సిపాలిటీలో 7, క్యాతనపల్లి మున్సిపాలిటీలో 10, నస్పూర్ మున్సిపాలిటీలో 24, లక్సెట్టిపేటలో 7 ఎంపీటీసీ సభ్యుల స్థానా లు కలిపేశారు. నిర్మల్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఖానాపూర్ మున్సిపాలిటీలో 4, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మున్సిపాలిటిలో 4 చొప్పున ఎంపీటీసీ సభ్యుల స్థానాలు కలిసిపోతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మున్సిపాలిటీగా ఆవిర్భవిస్తుండగా.. ఇందులో 5ఎంపీసీటీ సభ్యుల స్థానా లు కలుస్తున్నాయి. ఇవి కాకుండా ఆదిలాబాద్ ము న్సిపాలిటీలో కేఆర్‌కే కాలనీ, దస్నాపూర్, టీచర్స్‌కాలనీ, రాంనగర్, పిట్టల్‌వాడ, మావల గ్రామ పంచాయతీలు విలీనం చేయగా.. నిర్మల్ మున్సిపాలిటీలో వెంకటాపూర్, మంజులాపూర్ గ్రామాలు విలీనం చేయటంతో.. మరికొన్ని ఎంపీటీసీ స్థానాలు మున్సిపాలిటీల్లో కలుస్తున్నాయి.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles