పట్టణ సుందరీకరణకు మాస్టర్ ప్లాన్

Sun,February 17, 2019 02:39 AM

-పవర్‌పాయింట్ ప్రజెంటేషన్..
-పరిశీలించిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్‌నగర్ టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాల్టీని సుందరీకరించేందుకు మాస్టర్ ప్లాన్‌ను తయారు చేశారు. ఇందులో భాగంగా శనివారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నా యకులు, అధికారులతో మాస్టర్ ప్లాన్ 2041ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీడీఎఫ్ కన్సల్టెంటివ్ సంస్థ ప్రతినిధి వివరించారు. మున్సిపల్ గత, ప్రస్తుత భూగోళిక స్థితిగతులు, వ్యాపార, వాణిజ్య రంగాల పురోగతి, జనాభా పెరుగుదల, నిర్మాణ రంగంలో ఎదుగుద ల, మౌలిక వసతుల స్థితిగతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోని మాస్టర్ ప్లాన్‌ను ప్రాథమికంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. 1956లో టౌన్ మన్సిపాల్టీగా అవతరించగా, 1962లో అప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. 1989లో మరికొన్ని కాలనీలను విస్తరించగా, 1991లో జీటీపీ స్కీంలు అమలు చేశారనీ, 1995లో 3వ గ్రేడ్ మున్సిపాల్టీగా చేశారని చెప్పారు. పట్టణం నుంచి హైదరాబాద్‌కు 310 కిలోమీటర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 145 కిలోమీటర్లు , మంచిర్యాలకు 60, కుమ్రం భీం ఆసిఫాబాద్‌కు 28, సిర్పూరు(టి)18 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, 2021సంవత్సరానికి 67498 జనాభా, 2031 సంవత్సరానికి 78397, 2041 సంవత్సరానికి 90,861 జనాభా పెరుగుదలకు అనుగుణంగా పట్టణంలో మౌలిక వసతుల కోసం మాస్టర్ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు.

పట్టణంలో 71 శాతం మందికి పక్కా గృహాలు ఉండగా, 20 శాతం మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. ఒక కుటుంబంలో ఐదుగురు చొప్పున జీవిస్తున్నారనీ, మున్సిపాల్టీకి ఆదాయం పెరిగిందని తెలిపారు. పట్టణంలో 58 శాతం మరుగుదొడ్లు ఉన్నాయని, 90 శాతం చెత్త సేకరణ జరుగుతుందన్నారు. భవిష్యత్తులో కాలనీలు ముంపునకు గురికాకుం డా ఉండేందుకు నాళాల విస్తరణ చేపట్టాలని సూచించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి రాజీవ్‌గాంధీ చౌరస్తా మీదుగా భట్టుపల్లి చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ, వినయ్ గార్డెన్ నుండి బాలాజీనగర్ మీదుగా రోడ్డు విస్తరణ, సర్‌సిల్క్ వద్ద రైల్వే ైఫ్లెఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి, పట్టణంలో మూడు చౌరస్తాలతో పాటు శ్రీకాంత్ చారి చౌరస్తాను ఏర్పాటుకు మాస్టర్‌ప్లాన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీ డీటీ సీపీ రవీందర్, డీటీ సీపీవో సంపత్,టీపీఏ ప్రసాద్, ఆర్డీవో శివకుమార్, తహసీల్దార్ వనజారెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ, ఏడీఈ బాలకృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ విద్యావతి, సీపీ రాజ్‌కుమార్, డీటీఎస్ కన్సల్టెన్సీ సభ్యులు సునిల్ పోప్లి, పునిత్‌దిగ్ర, సందీప్ గంగల, సాక్షినాగపాల్ తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి
-కోనేరు కోనప్ప , సిర్పూరు ఎమ్మెల్యే
రానున్న రోజుల్లో పట్టణంలో మౌలిక వసతలు కల్పనపై దృష్టి సారించాలని, రోడ్లు, నాళాలు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పట్టణంలో ప్రజలకు పార్కు లేదనీ, దీని కోసం బాలాజీనగర్ సమీపంలో 17 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకోవాలని, బోరిగాం శివారులోని 72 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండగా ప్రస్తుతం డబుల్‌బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతుందని, భవిష్యత్ అవసరాల కోసం ప్రభు త్వ భూముల్లో దవాఖాన, కళాశాల, పాఠశాలల, క్రీడా మైదానం ఏర్పాటు ప్రజలకు ఉపయోగపడుతాయన్నారు. రహదారుల వెడల్పు, వాటర్ ట్యాంక్‌ల నిర్మాణం, ైఫ్లెఓవర్ నిర్మాణం, అండర్ బ్రిడ్జి నిర్మాణాలు అవసరమన్నారు. ముఖ్యంగా పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎస్పీఎం నుంచి వచ్చే నీటిని ఉపయోగించుకునే విధంగా సూచనలు ఉంటే ఇవ్వాలని తెలిపారు. అంతకుముందు సిర్పూరు ఎమ్మెల్యే కోనే రు కోనప్పకు శనివారం మున్సిపల్ కమిషనర్ తిరుపతి పుష్పగుచ్ఛం అందజేశారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles