గ్రామాలాభివృద్ధిలో సర్పంచులే కీలకం

Sun,February 17, 2019 02:39 AM

-పీఆర్, గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్
ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: గ్రామాభివృద్ధిలో సర్పంచులదే కీలక పాత్ర అని పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు ప్రసాద్ అన్నా రు. జిల్లా కేంద్రంలో శనివారం నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమనికి ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన ఉండలన్న ఉద్ధేశ్యంతోనే సీఎం కేసీఆర్ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారన్నారు. పంచాయతీ ఆదాయం, ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. శ్మశన వాటికలు, గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు వంద శాతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పారిశుధ్య నిర్వహన, ట్రై సైకిల్ వినియోగంలో తడి, పొడి చెత్త ను విడివిడిగా సేకరించి డంపింగ్ యా ర్డులు ఏర్పాటు చేసుకొని అక్కడే వేయాలన్నారు. ప్రతి నెలలో ఒక్క సారి సమావేశం ఏర్పాటు చేసుకొని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలన్నారు. రెండు నెలలుకు ఓసారి గ్రామ సభను నిర్వహించుకోవాలని అందులో చర్చించిన అంశాలపై , అత్యవసరమైన చోట వెంటనే పనులు చేపట్టాలన్నారు. గ్రామస్తుల సహకారంతో హరిత హారం, సర్సరీల పెంపకం మొదలగు వాటిపై సర్పంచులు దృష్టి సారించాలన్నారు. అనంతరం కలెక్టర్ స ర్పంచులు వారి విధులు, బాధ్యతలు, చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ గంగధర్‌గౌడ్ 2018 పంచాయతీ చట్టాన్ని వివరించారు. జేసీ రాంబాబు, డీఆర్‌డీఓ వెంకట్, సర్పంచులు, సంబంధిత అధికారులు, తదిత రులు పాల్గొన్నారు.
సన్మానం..
గోలేటి సింగరేణి గెస్ట్‌హౌస్‌లో పంచాయతీరాజ్, గ్రామాభివృద్ధి శాఖ కమిషనర్ నీతు ప్రసాద్‌ను గోలేటి సర్పంచ్ పొటు సుమలత కలిసి శాలువా కప్పి సన్మానించారు. డీ ఆర్‌డీఏ వెంకట్, ఏపీఓ కల్పన, ఈవోపీఆర్డీ కిర ణ్, కార్యదర్శి శంకర్, కారోబార్ సుధాకర్, మం డలాధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, గోలేటి ఉపసర్పంచ్ బొడుసు దేవానంద్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
నర్సరీ తనిఖీ
గోలేటి పంచాయతీ పరిధి గోండుగూడ ఈజీఎస్ నర్సరీని శనివారం నీతూప్రసాద్ పరిశీలించారు. వర్షకాలంలోగా మొక్కలు సిద్ధం చేయాలని సిబ్బందికి సూచించారు. గోలేటి స ర్పంచ్ పొటు సుమలత, డీఆర్‌డీఓ వెంకట్, ఈజీఎస్ ఏపీఓ కల్పన, పొటు శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles