అమర జవాన్‌లకు అశ్రునివాళి

Sat,February 16, 2019 01:51 AM

* జిల్లా వ్యాప్తంగా నివాళులర్పించిన ప్రజానీకం
* పలు చోట్ల కొవ్వొత్తులతో ర్యాలీలు
* ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు
కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు జిల్లా వ్యాప్తంగా కన్నీటి నివాళుర్పించారు. మీ మరణం వృథా కాదంటూ రాజకీయ పార్టీలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేట్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గట్టిగా నినదించారు. ప్లకార్డులు చేతబూని వీధుల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. ఆసిఫాబాద్, రెబ్బెన, జైనూర్, కాగజ్‌నగర్, బెజ్జూర్, పెంచికల్‌పేట్, చింతలమానేపల్లి, తదితర ప్రాంతాల్లో ఈ ర్యాలీలు నిర్వహించారు. సంతాపసూచకంగా మౌనం పాటించి వారి త్యాగాలను గుర్తుచేసుకున్నారు. పలువురు మాట్లాడుతూ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి సర్జికల్ ్రైస్టెక్ చేయాల్సిందేనని ముక్త కంఠంతో నినదించారు . ముష్కరులను వదిలిపెట్టవద్దని కోరారు.
- కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఉగ్రవాదుల దాడి హేయం
లింగాపూర్ : భారత సైనికులపై ఉగ్రవా దుల దాడి హేయం. అమరుల త్యాగాల ను ఈ దేశం మరిచిపోదు. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారికి ఖచ్చితంగా బుద్ది చెప్పాలి. ఉగ్రవాదుల విషయంలో ఆర్మీకి పూర్తి స్వేచ్ఛనివ్వాలి. ఈ దాడికి మన సైనికులు ఖచ్చితంగా బదులు తీర్చుకో వాలి. సర్జికల్ ైస్ట్రెక్ లాంటివి చేసి, పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పాలి. జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభుతి. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదు. మతాలు, ప్రాంతాల పేరిటా ఇన్ని కుటుంబాల్లో వేదన మిగిల్చడం సబబు కాదు.
- రాథోడ్ అర్జున్ , యువజన సంఘం నాయకుడు

గుణపాఠం చెప్పాలి..
రెబ్బెన: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడికి సహక రించిన వారికి గుణపాఠం నేర్పాలి. 42మంది మృతికి కారకులైన ఎవ్వరినీ వదలవద్దు. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలి. నా ఇద్దరు కుమారులు కూడా ఆర్మీలో చేరి దేశానికి సేవలందిస్తు న్నారు. జవాన్లపై దాడి చేసిన వారిని బహిరంగంగా ఉరి తీయాలి. జమ్మూలో ఉగ్రకదలికలపై కేంద్రం సీరియస్‌గా తీసుకోవాలి. ఆర్మీ ఆపరేషన్ చేపట్టి, భారత్‌లో అడుగు పెట్టాలంటే భయపడేలా చేయాలి.
- పిడుగు నారాయణ, గోలేటి టౌన్‌షిప్

దేశం నుంచి తరిమికొట్టాలి.
రెబ్బెన: ఉగ్రవాదులను ప్రోత్సహించే వారి ని సమాజం నుంచి తరిమికొట్టాలి. నా కొడుకు కూడా ఆర్మీలో విధులు నిర్వహి స్తున్నాడు. భారత సై న్యానికి ఎదురుపడి పోరాటం చేయలేక దొంగ దాడులు చేస్తున్నారు. ఈసారి ఉగ్ర మూకలకు బుద్ధి చెప్పేందుకు మన ఆర్మీ కఠినంగా సిద్ధమవ్వాలి. మరోసారి మన దేశం వైపు చూస్తే, ఏంజరుగుతుందో వారికి తెలిసిరావాలి. ఎన్నో కుటుంబాలకు కడుపుకోత మిగిల్చిన ఈ ఘటన అత్యంత బాధాకరం. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా రక్షణ శాఖ చర్యలు తీసుకోవాలి. అప్పుడే అర్మీలో ఉన్న కుటుంబాలు ప్రశాంతంగా ఉండగలవు.
- ముల్కోజు మంగ, భగత్‌సింగ్‌నగర్


త్యాగాలు వృధాకావు
ఆసిఫాబాద్ టౌన్: వీర జవాన్ల ప్రాణత్యా గం వృథాకాదు. జవాన్లు రక్తంచిందించిన నేల గుడితో సమానం. పుణ్యభూమి కోసం వారు చేసిన త్యాగాలు భారతా వనిలోని ప్రతి బిడ్డకు పెట్టిన ప్రాణభిక్ష. మా ప్రాణా లకోసం మీ ప్రాణాలను బలిపెడుతున్న భారత సైనికులకు పాదాభివందనం చేస్తు న్నా. ఉగ్రవాడుల దాడుల ఘటన విన్నాక హృదయం కలిచివేసింది. ఇలాంటి ము ష్కరులు దేశంలోకి రాకుండా, లేకుండా ఏరిపారేయాలి. దీనికి బదులు తీర్చుకునేందుకు ఆర్మీకి ధైర్యమివ్వాలి. -సత్యనారాయణ, ఆసిఫాబాద్


అమరులకు వందనం..
ఆసిఫాబాద్ టౌన్: నిన్న జమ్మూలో అమర లైన ప్రతి సైనికుడికి వందనం. దేశంలో అశాంతిని నెలకొల్పేందుకు తీవ్రవాదులు చేస్తున్న దాడులు పిరికి పంద చర్య. మన సైన్యం దీనికి బదులు తీర్చుకుంటుందనే నమ్మకం ఉంది. సరిహద్దుల్లో అల్లర్లకు కారణమవుతూ, దేశ భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ముష్కర ముఠాలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఘటన ఎందరో తల్లులకు కన్నీటిని మిగిల్చింది. రాత్రనక.. పగలనక.. దేశం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు అప్రమత్తంగా ఉండే మన ఆర్మీ ధీమాను, బలాన్ని ఇలాంటి పిరికిపంద చర్యలు ఏమి చేయలేవు.
-సాయి కృష్ణ, ఆసిఫాబాద్

మెరుగైన విద్య అందించాలి
లింగాపూర్: విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉం దని ఎంఈవో కుడ్మెత సుధాకర్ అన్నారు. మం డల కేంద్రం లోని కేజీబీవీని శుక్రవారం త నిఖీ చేశారు. ఈ సంధర్భం గా విద్యార్థులు. ఉపాధ్యాయ సి బ్బంది రిజిస్టర్ల ను పరిశీలిం చారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ ప్రతి రోజు క్ర మం తప్పకుండా మెనూ ప్రకా రం భోజనం పెట్టాలన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles