పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Sat,February 16, 2019 01:49 AM

-జాయింట్ కలెక్టర్ రాంబాబు
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వైద్య సిబ్బందిని జేసీ రాంబాబు ఆదేశించారు. ఈ నెల 19న నులి పురుగుల నివా రణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తన కా ర్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లా లో ఈనెల 19 నుంచి పంపిణీ చేయనున్న నులి పురుగుల నివారణ మాత్రలను పిల్లలందరికీ అం దించాలని ఆదేశించారు. 1 నుంచి 19 ఏళ్ల వ యస్సు ఉన్న పిల్లలందరికి తప్పని సరిగా అల్బెండజల్ మాత్రలు అందించాలన్నారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న పల్లిలకు మధ్యాహ్న భోజనం అనంతరం పిల్లలు మాత్రలు వేసుకునేలా చూడాలన్నా రు. 6 నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఒక మాత్ర, 1 నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు సగం మాత్ర వేయాన్నారు. దీనికి సంబంధించి అన్ని పాఠశాలలు, క ళాశాలల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో విద్యార్థులకు అవసరమైన 2 లక్షల 17 వేల 455 మాత్రలు అందుబాటులో ఉన్నాయన్నారు. 18 పీహెచ్‌సీలకు, కళాశాలలకు, పాఠశా లలకు, అంగన్‌వాడీ కేంద్రాలు సకాలంలో మాత్ర లు అందేలా చూడాలన్నారు. జిల్లాలో 1 నుంచి 5 ఏళ్ల లోపు పిల్లలు 46, 799 మంది, 6 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు 1 లక్ష 44 వేల 261 మంది ఉన్నారని తెలిపారు. అన్ని శాఖల అధికారులు స మన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారి బాలు, డీఆర్డీఏ పీడీ వెంకట్, డీడబ్ల్యుఓ సావిత్రి, డీపీఆర్‌ఓ తిరుమల, మలేరియా అధికారి సీతారం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles