మార్చి చివరికల్లా తాగునీరందించాలి

Sat,February 16, 2019 01:49 AM

-జిల్లాలో 1101 గ్రామాలకు సరఫరా లక్ష్యంగా పనిచేయాలి
-సీఎం కార్యాలయం, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మార్చి చివరి వారంలోగా మిషన్ భగీరథ ద్వారా స్వ చ్ఛమైన నీటిని అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఆదేశించారు. జిల్లాలో ఆడ ప్రాజెక్టు వద్ద జరుగుతున్న మిషన్ భగీరథ పనులను ఆ మె శుక్రవారం పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మిష న్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని 1101 గ్రా మాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలో ఇ ప్పటి వరు 997 గ్రామాలకు తాగునీరు అందించగా మి గతా గ్రామాలకు కూడా సకాలంలో నీటిని సరఫరాచేయాలన్నారు. నీటి ప్లాంట్లు ఏర్పాటుచేసిన ప్రదేశాలకు వెళ్లేందుకు సీసీ రోడ్లు, లైటింగ్, ప్రహారీ గోడలు ఏర్పాటు ఏర్పాటుచేయాలన్నారు.

గ్రామాల్లోని ప్రతి ఇంటికి నల్లా ల ద్వారా నీటిని అందించాలని సూచించారు. సర్పంచులు, అధికారులు గ్రామాల్లో శుద్ధనీటి వినియోగంపై అ వగాహన కల్పించాలన్నారు. మిషన్ భగీరథ వీడియో చిత్రాలను గ్రామాల్లో ప్రజలకు చూపించి అవగాహన కల్పించాలని అధికారులన ఆదేశించారు. ఇంట్రా విలేజ్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ తప్పని సరిగా ఇవ్వాలన్నారు. జిల్లాలో మొత్తం లక్షా 7 వేల 595 ఇం డ్లకు కనెక్షన్లు ఇచ్చామనీ, 903 హ్యాబిటేన్లకు గాను 169 గ్రామాలకు ఇంకా ఇవ్వాల్సి ఉందని అధికారులు స్మితా సబర్వాల్‌కు వివరించారు. ఆసిఫాబాద్ మండలంలో 56 , 635 ఇళ్లకు గాను 131.19 కిలోమీటర్ల పైపు లైన్ పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో పెండింగ్‌పను లు సకాలంలో పూర్తిచేయాలని అధికారులను స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ రాం బాబు, ఈఎన్‌సీ కృపాకర్, చీఫ్ ఇంజినీర్ జగన్‌మోహన్ రెడ్డి, ఎస్‌ఈబీసీ జ్ఞాన్ కుమార్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ, ఇంట్రా విలేజ్ గ్రిడ్ అధికారి కృష్ణమూర్తి, ఆర్డీవో దత్తు, డీఎస్పీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles