పల్లెల ప్రగతిబాట

Fri,February 15, 2019 12:02 AM

- మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు రోడ్లు
- ఎల్‌డబ్ల్యూఈ ద్వారా నిధులు మంజూరు చేసిన కేంద్రం
- 289 కిలోమీటర్లకు రూ. 315 కోట్ల కేటాయింపు
- త్వరలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో నిర్మాణం
- మారుమూల గ్రామాలకు తీరనున్న దారి కష్టాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టింది. వామపక్ష తీవ్రవా ద ప్రభావిత (ఎల్‌డబ్ల్యూఈ) ప్రాంతాల అభివృద్ధి నిధుల కింద జిల్లాలో రోడ్ల నిర్మాణానికి నిధులు మం జూరు చేసింది. 2019-20 సంవత్సరానికి గాను ఆసిఫాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గాల పరిధిలో 30 రోడ్ల నిర్మాణాలకు రూ. 315 కోట్లు మంజూరు చేసింది.

సున్నిత ప్రాంతాలపై నజర్..
సున్నితమైన ప్రాంతాలు అధికంగా ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలో రవాణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఇందుకుగా ను సుమారు 289 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలకు రూ. 315 కోట్లు కేటాయించింది. ఇందులో ఆ సిఫాబాద్ నియోజకవర్గంలో 16 రోడ్లకు 148 కోట్లు, సిర్పూర్-టి నియోజకవర్గంలో 14 రోడ్లకు 172 కోట్లతో నిర్మించనుంది. జిల్లాలో మావోయిస్టు ప్రభావిత గ్రామాలు అధికంగా ఉండడం, ఈ ప్రాంతాలకు రవాణ వసతులు సరిగా లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతోంది. దీంతో మౌలిక వసతుల కల్పనలో భాగంగా తొలుత రహదారుల ని ర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.

సిర్పూర్ నియోజకవర్గంలో...
సిర్పూర్ నియోజకవర్గంలోని కమ్మర్‌గాం నుంచి నందిగాం వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్లు, కుంచవెల్లిలో కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి రూ. 4 కోట్లు, దిందా నుంచి చిత్తమ్మ వరకు 10 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.11 కోట్లు, అగర్ గూడ నుంచి గుండపల్లి వరకు 25 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్లు, సోమిని నుంచి కోయపల్లి వరకు 25 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 25 కోట్లు, గూడెపల్లి నుంచి జిల్లెడ వరకు 20 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 20 కోట్లు, ముర్లిగూడ నుంచి పాపన్న పేట్ వరకు 16 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.16 కోట్లు, ఖర్జి నుంచి ముర్లిగూడ వరకు 25 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 25కోట్లు, దిగిడ నుంచి రాంపూర్ వరకు 5 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు, మెట్ల గూడ నుంచి రావులపల్లి వరకు 10 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 కోట్లు, ఖర్జి నుంచి లోహ వరకు 5 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్లు, కుంచవెల్లి నుంచి బెజ్జూర్ వరకు 2 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్లు, బారెగూడ నుంచి బెజ్జూర్ వయా కుకుడా వరకు 9 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 9 కోట్లు, గూడెం నుంచి చిత్తం వరకు 2 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్లు మంజూరయ్యాయి.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో..
నియోజకవర్గంలోని మోవాడ్ నుంచి చోర్‌పల్లి వయా బీమన్‌గొంది వరకు 15 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 18 కోట్లు, ఓవాడ్ నుంచి కౌటాన్ మోవాడ్ వరకు 10 కి.మీ రూ.12 కోట్లు, మంచి నుంచి దంపూర్ వయా కొత్తగూడ వరకు 11 కి.మీ రూ. 12 కోట్లు, గుండాల నుంచి మంగి వరకు 12 కి.మీ వరకు రూ. 15 కోట్లు, నాయకపు గూడ నుంచి గుండాల వరకు 6 కి. మీటర్లకు రూ.6 కోట్లు, దంపర్ నుంచి కెరగూడ వరకు 6 కి.మీ వరకు రూ. 6 కోట్లు, కెరమెరి ఘాట్ నుంచి కిషన్ నాయక్ తండా వరకు 7 కి.మీ వరకు రూ.9 కోట్లు, కోవెన నుంచి జామల్‌ధర వరకు 7 కి.మీ రోడ్డు కోసం రూ.8 కోట్లు, సిర్పూర్-యు నుంచి పాములవాడ వరకు 4 కి.మీటర్లకు రూ. 4 కోట్లు, పంగిడి నుంచి మాధరతండా వరకు 8 కి.మీ రోడ్డుకు రూ. 8 కోట్లు, రాఘవపూర్ నుంచి గోవెన వరకు 8 కి.మీ రోడ్డుకు రూ.8 కోట్లు, ఖమాన నుంచి సర్కెపల్లి వరకు 9 కి.మీ రోడ్డుకు రూ. 10 కోట్లు, ఆడ దస్నాపూర్ నుంచి బోడేఘాట్ వరకు 6 కి.మీ రోడ్డుకు రూ. 8 కోట్లు, సిర్పూర్-యు నుంచి దేవుడు పల్లి వరకు 6 కి.మీ రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్లు, వంజరిగూడ నుంచి గీత బండ వరకు 10 కి,మీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది.

తీరనున్న రవాణా సమస్యలు...
జిల్లాలో మారుమూల గ్రామాలకు సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక గ్రామాలకు రహదారుల నిర్మాణం చేపట్టింది. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారుల నిర్మాణం చేపట్టింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం నుంచి మావోయిస్టు ప్రభావిత గ్రామాల అభివృద్ధి నిధులు కూడా రానుండడంతో, ఈ రహదారులన నిర్మాణం మరింత వేగవంతం కానుంది. ఎన్నో ఏళ్లుగా రహదారుల కోసం ఎదురుచూస్తున్న మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలగనుంది.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles