పంటలకు ప్రోత్సాహం

Fri,February 15, 2019 12:01 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రై తులు సాగుచేస్తున్న ప్రధాన పంటల ఆధారంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర సర్కారు చ ర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ జి ల్లాలో జొన్నలు, కూరగాయల పంటలు అధికంగా సాగవుతున్నట్లు గుర్తించిన అధికార యంత్రాంగం, ఇప్పటికే ప్రభు త్వానికి నివేదిక అందజేసింది. తెలంగాణ బ్రాండ్ పంటల ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవిధంగా ఈ ప్రాంతంలో అవసరమైన ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పేందుకు చర్యలు తీసుకోనున్నారు.

జొన్నలు.. కూరగాయలే బ్రాండ్
జిల్లాలో రైతులు ప్రధాన ఆహార పంటగా జొన్నను సాగుచేస్తున్నారు. వాణిజ్య పరంగా పత్తి పంటను అధికంగా సాగుచేస్తుండగా, ఆహార పంటల్లో జొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. వానాకాలంలో సుమారు 2500 హెక్టార్లలో జొన్న సాగవుతోంది... ఏసంగింలో సుమారు 1700 హెక్టార్లలో సాగవుతోంది. రైతులు ఆహారంగా వినియోగించగా మిగిలిన జొన్నపంటను బయట మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో పాటు జిల్లాలో కూరగాయలు సా గుచేస్తున్న రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. దీంతో వీటి ఆధారిత పరిశ్రమలను ఇక్కడ స్థాపిస్తే, మరింత ఉత్పత్తి పెరిగి , జిల్లా నుంచి అవసరమైన ప్రాంతాలకు ఎగుమతి చేసే అవ కాశం కూడా ఉంటుంది.

ఏటా పెరుగుతున్న సాగు..
సంప్రదాయ పద్ధతులతో పాటు ఆధునిక సాగువైపు కూ డా జిల్లా రైతులు అడుగులు వేస్తున్నారు. అందుకే ఏటా ఆ హర పంటల సాగును పెంచుతున్నారు. ప్రభుత్వం కూరగాయలు, పండ్లు సాగుచేసేందుకు ఆసక్తి చూపే రైతుల కోసం అనేక రాయితీలను అమలుచేస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ( ఆర్‌కేవీవై) పథకం ద్వారా తీగజాతి కూరగాయ లు, పండ్లు పండించే రైతుల కోసం శాశ్వత పందిళ్ల పథకం అమలు చేస్తోంది. దీనికోసం ఎకరాకు రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుండగా, ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురు రైతులకు సంబంధించిన 5 ఎకరాల్లో పథకాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది 12 ఎకరాల్లో శాశ్వత పందిళ్లు ఏర్పాటుచేయాలని ప్రభత్వుం లక్ష్యంగా నిర్ధేశించింది. ఇదేవిధంగా సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా పండ్లతోటల పెం పకం, వాటి సంరక్షణ, నిర్వహణ కోసం మూడేండ్ల వరకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథ కం ద్వారా జిల్లాలో 65 ఎకరాల్లో పంటలను ప్రోత్సహించేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం రూ. 6 లక్షల 89 వేలు కేటాయించారు. జిల్లాలో సీజన్‌లో సు మారు ఒక మెట్రిక్ టన్ను వరకు కూరగాయాలను మార్కె ట్‌కు తీసుకువస్తున్నారు...

హరిత పందిళ్లతో నూతన ఒరవడి..
జిల్లాలో పాలిహౌస్ పథకం ద్వారా సాగు చేసేలా ప్రభు త్వం ప్రోత్సహాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 95 శాతం, ఇతరులకు 75 శాతం రాయితీ కల్పిస్తున్నారు. జిల్లాలోని సిర్పూర్-టి మండలంలో 33 లక్షల 76 వేల రూపాలయతో 1 ఎకరంలో అధికారులు మాడల్ పాలిహౌజ్‌ను ఏ ర్పాటు చేశారు. ఈ ఏడాది జిల్లాలో 9.5 ఎకరాల్లో పాలిహౌజ్‌లు ఏర్పాటుచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా రు. దీనికోసం రూ. కోటీ 14 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం రాయితీపై బిందు సేద్యం పరికరాలు ప్రభుత్వం అందిస్తుండగా బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీతో అందిస్తున్నారు. జిల్లా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 32 మంది రైతులు 40 .15 ఎకరాల్లో బిందు సేద్యం పథకం దార్వా సాగుచేసేందుకు లబ్ధిపొందారు. ఇదేవిధంగా తుంపర సేద్యం ద్వారా 75 శాతం రాయితీ కల్పిస్తుండడం తో ఇప్పటివరకు 60 మంది రైతులు లబ్ధిపొందారు. గతంలో పోలిస్తే జిల్లాలో రైతులు ప్రభుత్వం పథకాలను వినియోగించుకోవడంలో ఆసక్తిని చూపుతూ నూతన పంటల వైపు అడుగులు వేస్తున్నారు. ఇక జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అందుబాటులోకి వస్తే, ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం కలుగుతుంది.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles