నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ

Fri,February 15, 2019 12:00 AM

తిర్యాణి : రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని ఆసిఫాబాద్ ఆర్టీవో శ్యాం నాయక్, ఎస్‌ఐ అశోక్ అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గురువారం కుమ్రం భీం చౌరస్తాలో ఆటో డ్రైవర్లు, యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ డ్రైవింగ్ వృత్తిలో ఎక్కువగా నిరుపేద కుటంబం నుంచి వచ్చిన వారే ఉన్నారన్నారు. వారిపై తమ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని రోడ్డు నిబంధనలకు లోబడి వాహనాలు నడపాలన్నారు. మద్యం తాగి, ఫోన్ మాట్లాడుతూ నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మానవతప్పిదం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, వాటి నివారణకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అధికారులు, డ్రైవర్లు, ప్రజలు ఉన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles