ఆసిఫాబాద్‌లో ఆహారశుద్ధి కేంద్రం

Thu,February 14, 2019 01:30 AM

-రూ. 1. 27 కోట్లతో ఏర్పాటుకు సన్నాహాలు
-చిర్రకుంటలో రూ. 15 లక్షలతో దాల్‌మిల్
-రూ. 20 లక్షలతో షెల్టర్ హౌస్ నిర్మాణం
-త్వరలో సమీకృత మార్కెట్ యార్డు
-ఆనందంలో అన్నదాతలు
కుమ్ర భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రూ. కోటి 27 లక్షలతో సమీకృత మార్కెట్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ప్రధానంగా కూరగాయలు సాగు చేపడుతున్నారు. రైతులు కూరగాయలను మార్కెట్‌కు తీసుకు వచ్చి గిట్టుబాటు ధరకు అమ్ముకునేందుకు సరైన వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది రూర్బన్ పథకం ద్వారా ప్రత్యేక మార్కెట్ వసతులు కల్పించినప్పటికీ.. కూరగాయల మార్కెట్ నిర్వహణకు సరిపడా సౌకర్యాలు లేవు. దీంతో కూరగాయల మార్కెట్ ఇంకా వివేకానంద చౌక్‌లోనే కొనసాగుతున్నది. కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డులో మాంసం విక్రయదారులు మాత్రమే షెడ్‌లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా రూ. కోటి 27 లక్షలతో సమీకృత మార్కెట్ యార్డును ఏర్పాటు చేస్తుండంతో రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎంతో సౌకర్యం కలగనున్నది. దీంతో పాటు జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని చిర్రకుంటలో రూ. 15 లక్షలతో దాల్‌మిల్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆసిఫాబాద్ జిల్లాలో పప్పు దినుసుల్లో ఎక్కువగా కంది పంటను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 17 వేల హెక్టార్లలో కంది సాగవుతోంది. చిర్రకుంటలో ఏర్పాటు చేసే దాల్‌మిల్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీంతో రైతుల నుంచి కందుల కొనుగోళ్లు పూర్తిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే చేపట్టనున్నారు. దీంతో పాటు మరో రూ.20 లక్షలతో షెల్టర్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయంగా...
రైతాంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు పంట కాలనీలు, ఆహారశుద్ధి కేంద్రాల ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు అవసరమైన చర్యలు చేపడుతున్దని. అదే సమయంలో నిరుద్యోగ యువత, మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆహారశుద్ధి కేంద్రాలను ఒక వనరుగా వినియోగించనున్నారు. రైతులు పంటలు సాగు చేసే విధానాలను మొదలుకొని.. వాటిని అమ్ముకునే వరకు అనుసరించాల్సిన విధానాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురానున్నారు. చాలా చోట్ల ఒకే రకమైన పంటలు సాగు చేస్తున్నారు. దీంతో ధరల పతనం, పంటల సాగులో ఇబ్బందులు ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి విధానాల్లో సమూలమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

క్రాప్ కాలనీలకు శ్రీకారం...
వాణిజ్య పంటల సాగుతో నష్టపోతున్న రైతులను కూరగాయల వైపు మళ్లించేందుకు క్రాప్ కాలనీలు ఏర్పాటు చేయాలని సర్కారు సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నది. ఏటేటా తగ్గిపోతున్న కూరగాయల సాగు కారణంగా మార్కెట్ కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. దీనిని అధిగమించడంతో పాటు కూరగాయల కొరతను తీర్చేందుకు ప్రత్యేకంగా కూరగాయల కాలనీలు ఏర్పాటు చేయడంతో పాటు.. మధ్య దళారులు లేకుండా నేరుగా వినియోగ దారులు అమ్ముకునేందుకు రైతు బజార్లను ఏర్పాటు చేయనున్నది. దీనికోసం పట్టణాలకు సమీపంలోని గ్రామాలు, రవాణా వసతి గల మండలాలను ఎంపిక చేసిన అధికారులు.. కూరగాయల సాగుకు ముందుకు వచ్చే రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్‌లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లాలో 2067 హెక్టార్లలో కూరగాయల సాగు
జిల్లాలో మార్కెట్ దగ్గరగా ఉండే ప్రాంతాల్లో క్రాప్ కాలనీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 2067 హెక్టార్లలో రైతులు కూరగాయలు సాగుచేస్తున్నారు. చిన్న, సన్నకారు రైతుల అవసరాల మేరకు కూరగాయలు సాగు చేస్తున్నారు. జల్లాలో ప్రధానంగా టమాట పంటను సాగుచేస్తున్నారు. మిగతా కూరగాయలు కాకర 110 హెక్టార్లు, సోర 127, వంకాయ 322, మిరప 238, దోస 50, బెండ 140, ఉల్లి 300, ముల్లంగి 10, పర్వల్ 30, బీర 50, టమాట 690 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఆసిఫాబాద్ మండలం కొండపల్లి, ఎల్లారం, ఆడ, వాడిగూడ, , వాంకిడి మండలం కిర్డి, జైత్‌పూర్, బెండార, కన్నెర్‌గాం, కెరమెరి మండలం రింగన్‌గూడ, అనార్‌పల్లి, ఖైరీ, కెరమెరి, మోడీ, ఝరి, సావర్‌ఖేడ్, రెబ్బెన మండలం గంగాపూర్, కాగజ్‌గనర్ మండలం నజ్రుల్‌గనర్, బెంగాళీ క్యాంపులో కూరగాయల సాగుచేస్తున్నారు. వ్యవసాయ బోర్లు, బావులు ఉన్న రైతులు కూరగాయాల సాగువైపు మొగ్గుచూతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రైతులు ఆహార పంటలవైపు మొగ్గుచూపనున్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles