అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు

Thu,February 14, 2019 01:28 AM

-184 మందికి పంపిణీ
-యాప్‌పై అవగాహన కల్పించిన
ఐసీడీఎస్ సీడీపీవో విజయలక్ష్మి
సిర్పూర్(టి) : అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజువారీ కార్యక్రమాల వివరాల నమోదు కోసం బుధవారం మండల కేంద్రంలోని సిర్పూర్ ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో సిర్పూర్(టి) ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీవో విజయలక్ష్మి, టీచర్లకు స్మార్ట్‌ఫోన్‌లను పంపిణీ చేశారు. అనంతరం అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సిర్పూర్(టి) ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని 202 అంగన్‌వాడీ కేంద్రాల్లోని 184 మంది టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అవినీతి అక్రమాల వెలికితీత కోసమే స్మార్ట్‌ఫోన్‌న్లను అందజేసినట్లు పేర్కొన్నారు. ప్రతి రోజూ కేంద్రాల్లో హాజరవుతున్న పిల్లల సంఖ్యతో పాటు మెనూ ప్రకారం భోజనం అందించి, వాటి వివరాలను మొబైల్ యాప్‌లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరఫరా చేస్తున్న పౌష్ఠికాహారాన్ని కచ్చితంగా లబ్ధిదారులకు అందజేయాల్సిన బాధ్యత టీచర్లపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీవో చంద్రకళ, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles