నిర్మాణాలు వేగవంతం చేయాలి

Thu,February 14, 2019 01:28 AM

-డీఆర్డీఓ పీడీ వెంకటి
తిర్యాణి : మరుగుదొడ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంబంధిత సిబ్బందిని డీఆర్డీవో పీడీ వెంకటి ఆదేశించారు. మండలంలోని ముల్కల మంది, మంగి, తోయరేటి, పిట్టగూడ, తాటిగూడ గ్రామాలను బుధవారం సందర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. వాటి ఆవిశ్యకతపై గిరిజనులకు వివరించారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈజీఎస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలానికి 3815 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరయ్యాయన్నారు. అందులో 1132 నిర్మాణాలు పూర్తవగా, మిగతావి ఆయా దశల్లో కొనసాగుతున్నాయని తెలిపారు. ఈజీఎస్ సిబ్బంది సమష్టి కృషితో బాధ్యతా యుతంగా ఎప్పటికప్పుడు ఆయా గ్రామాలను సందర్శించి, వందశాతం నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కూలీకీ వందరోజుల పని తప్పకుండా కల్పించాలన్నారు. ముల్కల మంది, తాటిగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీ పనులను పూర్తిచేయాలన్నారు. ఇంకుడుగుంతలు పూర్తయ్యేలా చూడాలన్నారు. అలాగే రూ.10లక్షలతో తిర్యాణి మండలానికి వైకుంఠదామం మంజూరైనట్లు చెప్పారు. మండలంలోని 17 పాఠశాలలకు వంటగదుల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. పంగిడిమాదరలో గ్రామీణ మార్కెట్ షెడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి, పంపించామన్నారు. పశువుల, కోళ్ల యజమానులకు షెడ్లు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యారని తెలిపారు. సమావేశంలో ఎంపీడీఓ సత్యనారాయణగౌడ్, ఈసీ రవీందర్, టీఏ, ఎఫ్‌ఏలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles