పరీక్షలంటే భయం వద్దు

Thu,February 14, 2019 01:28 AM

-సమయాన్ని సద్వినియోగం చేసుకోండి
-ఉత్తమ ఫలితాలు సాధించండి
-పది విద్యార్థులకు ఎస్పీ మల్లారెడ్డి సూచన
-రెబ్బెనలో పోలీసుల ఆధ్వర్యంలో పరీక్షా సామగ్రి పంపిణీ
రెబ్బెన : పదోతరగతి విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దనీ, నిర్భయంగా రాసి మంచి ఫలితాలు సాధించాలని ఎస్పీ మల్లారెడ్డి సూచించారు. పోలీసులు-మీ కోసం భాగంగా రెబ్బెన పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అతిథిగృహం ఆవరణలో వివిధ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. పరీక్షా సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడారు. పరీక్షలకు సమయం ఉందని నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ప్రణాళిక బద్ధంగా చదివి, మంచి ఫలితాలు సాధించాలన్నారు. తల్లిదండ్రులు చదువు గురించి విద్యార్థులపై ఒత్తిడి తీసుకరావద్దనీ, స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. చదవి పరీక్ష రాయడం ఎంత ముఖ్యమే, మంచి రాత కలిగి ఉండడం కూడా అంతే ముఖ్యమన్నారు.

అందుకు రాత సాధన కూడా చేయాలని సూచించారు. రోజూ 6 గంటలు నిద్రపోవడంతో పాటు మంచి ఆహారం తీసుకోవాలనీ, అప్పుడే బాగా చదవడంతో పాటు బాగా పరీక్షలు రాయవచ్చని సూచించారు. విద్యార్థులు చదివిన విషయాలు ఎప్పటికపుడు మననం చేసుకుంటే బాగా గుర్తుండి పోతాయన్నారు. పరీక్షలకు వెళ్లే సమయం ముందు ఏం తీసుకెళ్లాలో గుర్తుచేసుకుంటే మంచితన్నారు. పరీక్షా కేంద్రాలు దూరం ఉన్న విద్యార్థులు సమయానికి ముందుగానే ఉండేలా చూసుకోవాలని సూచించారు. పరీక్ష పత్రం తీసుకున్న తరువాత పదినిమిషాలు క్షుణ్నంగా చదివి, వచ్చిన వాటికి ముందుగా సమాధానం రాయాలన్నారు. పది నిమిషాల ముందే పరీక్ష ముగించుకొని, రాసిన వాటిని పరీశీలించుకుంటే పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఉంటుందన్నారు. మౌనంగానే ఎదగమనీ.. మొక్క నీకు చెబుతుందీ.. అనే పాట పాడి ఎస్పీ, అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా సామగ్రి అందించారు. కార్యక్రమంలో రెబ్బెన సీఐ వీవీ రమణమూర్తి, ఎస్‌ఐ దీకొండ రమేశ్, ఎంఈఓ వెంకటేశ్వరస్వామి, ఎంపీపీ కార్నాధం సంజీవ్‌కుమార్, రెబ్బెన, నంబాల సర్పంచులు బొమ్మినేని అహల్యాదేవి, చెన్న సోమశేఖర్, ఉప సర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, మాజీ ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్, సింగిల్‌విండో డైరెక్టర్ పెసరి మధునయ్య, ఆర్ట్స్ అండ్ సైన్స్ డీగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జాకీర్ ఉస్మానీ, స్థానికులు మోడెం సుదర్శన్‌గౌడ్, మోడెం రాజాగౌడ్, వినోద్‌జైస్వాల్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, పదోతరగతి విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్పీ మల్లారెడ్డికి సన్మానం..
ఎస్పీ మల్లారెడ్డిని రెబ్బెన, నంబాల సర్పం చులు బొమ్మినేని అహల్యదేవి, చెన్న సోమశేఖర్, స్థానిక నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, మడ్డి శ్రీనివాసగౌడ్ సన్మానించారు. ఎస్పీని సన్మానించడం ఆనందంగా ఉందని వారు స్పష్టం చేశారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles