పంచాయతీల్లో పన్నుల వసూలు వేగవంతం

Thu,February 14, 2019 01:27 AM

-మార్చి 15కల్లా టార్గెట్ పూర్తికి చర్యలు
జైపూర్: గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. జనవరి నెలలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది ప్రస్తుతం గ్రామాల్లో పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. మండలంలోని 20 గ్రామపంచాయతీలకు రూ. 34,61, 306 లక్ష్యం నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ. 14, 49,175 వసూలు చేసినట్లు ఎంపీడీఓ నాగేశ్వర్‌రెడ్డి, ఈఓపీఆర్‌డీ సతీష్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 35 శాతం పన్నులు వసూలు చేసినట్లు వివరించారు. మార్చి 15లోగా 100 శాతం ఇంటి పన్నులు, నల్లా బిల్లులు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకు ప్రతి పంచాయతీలో 100 శాతం పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో బాగంగానే పన్నుల వసూలు వేగవంతం చేసినట్లు తెలిపారు. పన్నుల వసూళ్ల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles