ఆ పంచాయతీ పోరుకు..

Thu,February 14, 2019 01:27 AM

-వెంకటాపూర్ సర్పంచ్ స్థానానికి ఎన్నికలు
-నోటిఫికేషన్ విడుదల
-16 నుంచి నామినేషన్ల స్వీకరణ
-28న పోలింగ్.. ఫలితాలు
-13 ఉపసర్పంచ్..76 వార్డు స్థానాలకూ అదే రోజు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్న ఒక సర్పంచ్, 76 వార్డు స్థానాలకు ఈనెల 16 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 17 న నామినేషన్ల పరిశీలన, 20 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 28న పోలింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికలు నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 14న ఓటర్ల జాబితాను విడుదల చేస్తారు. ఆసిఫాబాద్ మండలంలో గత ఎన్నికలు బహిష్కరించిన వెంకటాపూర్‌లో సర్పంచ్ స్థానానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నిక జరుగనుంది. అదేవిధంగా 14 మండలాల్లోని 76 వార్డు సభ్యుల స్థానాలకూ ఎన్నికలు నిర్వహించనున్నారు.

13 మంది ఉప సర్పంచులకు..
ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యా ప్తంగా 13 పంచాయతీల్లో ఉప సర్పంచులను ఎన్నుకోలే దు. సరైన కోరం లేకపోవటంతో ఈ ఎన్నికలు వాయిదా వే శారు. ఆసిఫాబాద్ మండలంలోని రౌట్ సంకెపల్లి, బెజ్జూర్ మండలంలోని కుకుడ, పోతెపల్లి, దహెగాం మండలంలోని కొత్మిమీర్, కాగజ్‌నగర్ మండలంలోని అనుకోడ, భట్‌పల్లి, చింతగూడ, ఈజ్‌గాం, కౌటాల మండలంలోని కన్కి, పెంచికల్‌పేట్ మండలంలోని చెడ్వాయి, పోతెపల్లి, ఎల్కపల్లి, ఎల్లూర్ గ్రామ పంచాయితీలలో ఈనెల 28న ఉపసర్పంచుల ఎన్నిక జరుగనుంది.

జిల్లాలో పంచాయితీ ఎన్నికలు జరిగే స్థానాలు..
ఆసిఫాబాద్ మండలంలోని వెంకటాపూర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి
వార్డులకు ఎన్నికలు జరిగే స్థానాలు(మండలాల వారీగా):
ఆసిఫాబాద్ : చిలాడిగూడ 4వ వార్డు, తెంపల్లిలోని 7వ వార్డు, వెంకటాపూర్‌లోని 4,5,6,7,8 వార్డులు
బెజ్జూర్: లంబాడిగూడ 3,4,6,7,8వ వార్డులు
చింతలమానెపల్లి : లంబాడిహెట్టి 7 వ వార్డు, రణవెల్లిలోని 8వ వార్డు
దహెగాం : పీపీరావవు కాలనీలో 7వ వార్డు
జైనూర్: దబోలి లో 4 వార్డు, రావూజీగూడలో 2 వార్డు
కాగజ్‌నగర్: అంకుసాపూర్‌లో 8వ వార్డు, మాలినిలో 7,8 వార్డులు, ఎన్‌జీఓస్ కాలనీ 6,8 వార్డులు, రాంనగర్(ఎన్) 4 వార్డు, వల్లకొండలో 7 వార్డు
కెరమెరి: బాబెఝరిలో 4 వ వార్డు, బోలాపటార్‌లో 1 వార్డు, ధనోరలో 5,7 వార్డులు, పార్డలో 4 వ వార్డు
కౌటాల: బాలెపల్లిలో 2వ వార్డు,
పెంచికల్‌పేట్: చెడ్వాయిలో 1,3,6,8 వ వార్డులు
సిర్పూర్-టి: చీలపల్లిలో 6వ వార్డు, చింతకుంటలో 5వ వా ర్డు, హుడ్కిలిలో 6వ వార్డు, ఇటిక్యాల పహాడ్‌లో 1,3,4, 5,6,7,8 వార్డులు, మేడిపల్లిలో 1,2,3,5,6,7 వార్డులు
తిర్యాణి: కౌటగాంలోని 7వ వార్డు, మెస్రగూడలోని 5వ వార్డు
వాంకిడి: బెండాలలో 6వ వార్డు, చిచ్చుపల్లిలో 7 వార్డు, దొడ్డిగూడలో 1,8 వార్డులు, జైత్‌పూర్‌లో 2 వార్డు, జంబులధరిలో 2, 4 వార్డులు, లక్ష్మీపూర్‌లో 1,5 వార్డులు, నవేధరిలో 4 వార్డు, నవేగాంలో 1,3 వార్డులు, వెలిగిలో 1,2,4,6,7,8 వార్డులు, సోనాపూర్‌లో 1,7 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles