నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్

Thu,February 14, 2019 01:26 AM

-ఖీమానాయక్ తండాలో రూ.5లక్షల విలువ గల కలప పట్టివేత
-పది మంది కేసు
-గుట్కా, మద్యం అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు
-డీఎస్పీ సత్యనారాయణ
లింగాపూర్: నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ ని ర్వహిస్తున్నామని డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఖీమానాయక్ తండాలో పోలీస్, అటవీ శాఖల ఆధ్వర్యంలో కార్డన్‌సర్చ్ నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా తనిఖీలు చేశారు. పత్రాలు సరిగా లేని 10 ద్విచక్రవాహనాలకు జరిమానా విధించారు. అలాగే సుమారు రూ.5లక్షల విలువ గల టేకు కలప దుంగలను పట్టుకున్నారు. గ్రామంలో వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకొని 10మందిపై కేసు నమోదు చేశారు. భారీగా కలప పట్టుబడడంతో అటవీ సిబ్బంది ఆశ్చర్యపోయారు. పట్టుకున్న కలపను అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అలాగే కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ.. గ్రామంలో గుడుంబాను అరికట్టాలని గ్రామస్తులకు సూచించారు. వాహనాలకు అన్ని పత్రాలు కలిగి ఉండాలన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలనీ, మద్యం గుట్కాలు అమ్మిన్న వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్డన్ సర్చ్‌లో జైనూర్ సర్కిల్ సీఐ షాదిక్ పాషా, లింగాపూర్ ఎస్‌ఐ తిరుపతి, జైనూర్, సిర్పూర్, వాంకిడి ఎస్‌ఐలు శ్రీనివాస్, సాజిత్‌ఖాన్, చంద్రశేఖర్, ఫారెస్ట్ రేంజ్ అధికారులు సంతోష్‌కుమార్, రాజేశ్వరాచారి, ఏఫ్‌ఏస్‌వోలు లక్ష్మీనారాయణ, ప్రవీణ్‌నాయక్, ప్రవీణ్‌కుమార్, జ్జానూశ్వర్, ఎఫ్‌బీవోలు, పోలీసులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles