తలసేమియా వ్యాధి గ్రస్తులను ఆదుకోవాలి

Wed,February 13, 2019 12:28 AM

మందమర్రి రూరల్ : తలసేమియా వ్యాధిగ్రస్థులను రక్తదారం చేసి ఆదుకోవాలని సింగరేణి ఎంవీటీసీ కృష్ణారావు పేర్కొన్నారు. స్థానిక ఎంవీటీసీలో నూతనంగా శిక్షణ పొందుతున్న సింగరేణి కార్మికులకు తలసేమియా వ్యాధి, రక్తదానంపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీటీసీ మేనేజర్ కృష్ణారావ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తలసేమియా వ్యాధి ప్రభావం ఎంతో ఉందన్నారు. సమయానికి రక్త అందక పోతే ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా మనిషి నిండు ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్త దానం ద్వారా దాతలకు ఎలాంటి హాని కలుగదని చెప్పారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం సింగరేణి యాజమాన్యం ఎంతో కృషి చేస్తున్నదని తెలిపారు. జీఎం రాఘవులు చోరవతో రక్త దాన శిబిరాలు విజయమవుతాయని పేర్కొన్నారు. బుధవారం రక్తదాన శిబిరం ఎంవీటీసీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తలసేమియా వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు కాసర్ల రంజిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles