సమస్యల పరిష్కారానికి కృషి

Wed,February 13, 2019 12:28 AM

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని సమస్యలను పరిష్కరిస్తామని జీఎం సుభానీ హామీ ఇచ్చారు. ఏరియా గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘం (టీబీజీకేఎస్) చర్చల ప్రతినిధులతో మంగళవారం ఏరియా స్థాయి నిర్మాణాత్మక సమావేశం జరిగింది. ఈ చర్చల్లో జీఎం సయ్యద్ ఎం సుభానీ, డీవైజీఎం గోవిందరాజు, ఎస్‌ఓటూజీఎం సత్యనారాయణ, టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, చర్చల ప్రతనిధులు పాల్గొని కార్మికుల గనుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై, కార్మికుల కాలనీల్లోని సమస్యలపై చర్చించారు. ఎస్‌ఆర్‌పీ 3గనిపై కార్మికులకు గోదావరి నుంచి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. గనిలో నాణ్యత గల డ్రిల్ రాడ్స్ సరఫరా చేయాలని కోరారు. నాణ్యత లేని డ్రిల్‌రాడ్స్‌తో కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అరుణక్కనగర్ వద్ద ప్రగతీ స్టేడియానికి వెళ్లే చౌరస్తా వద్ద ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై ప్రమాద సూచికలు ఏర్పాటు, చేయాలని కోరినట్లు తెలిపారు. ఉపరితలంలో పనిచేసే భూగర్భగని క్యాటగిరీ కార్మికులకు అండర్ గ్రౌడ్ అలవెన్స్ చెల్లించాలని కోరామన్నారు.

జీఎం కార్యాలయంలో క్యాంటిన్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగించి, గనులపై మాదిరిగా సబ్సిడీ రేట్లపై తినుబండారాలు అందించాలని కోరారు. జీఎం కార్యాలయంలో సమావేశ హాల్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు. జీఎం కార్యాలయం వద్ద సెల్ నెట్‌వర్క్ సరిగా పని చేయడం లేదని, ఈ ఏరియాల్లో సెల్ సంస్థలకు టవర్ ఏర్పాటు చెయడానికి స్థలం కేటాయించాలని కోరామన్నారు. కారు పార్కింగ్‌లకు షెడ్డులు నిర్మించాలని కోరారు. పై సమస్యల పరిష్కారానికి జీఎం అంగీకరించి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారని టీబీజీకేఎస్ నాయకులు చెప్పారు. ఈ సమావేశంలో ఏజీఎం నాగేశ్వర్‌రావు, ప్రాజెక్టు ఆఫీసర్ కవీంద్ర, డీవైజీఎం విజయభాస్కర్‌రెడ్డి, ఎం శ్రీనివాస్, మధుసూదన్, చిరంజీవి, డీవైసీఎంఓ డాక్టర్ విజయలక్షి, సివిల్ ఎస్‌ఈ రామక్రిష్ణ, ఆడిటర్ శ్రీనివాస్‌లు, పైనాన్స్ మేనేజర్ ఎన్ రాజం, టీబీజీకేఎస్ చర్చల ప్రతినిధులు అన్నయ్య, రాజనాల రమేశ్, పోశెట్టి, అశోక్, పీఎం కిరణ్‌కుమార్ టీబీజీకేఎస్ నాయకులుపాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles