జనంలోకి రండి..

Wed,February 13, 2019 12:27 AM

-మావోయిస్టులకు పోలీసులు, కుటుంబ సభ్యుల పిలుపు
-ఉమ్మడి జిల్లా నుంచి అజ్ఞాతంలో 21 మంది..
-తాజాగా ఒగ్గు సట్వాజీ దంపతుల లొంగుబాటు
-ఇప్పటికే జన జీవన స్రవంతిలో కలిసిన కంతి రవి
-రాష్ట్ర సర్కారు ఆర్థిక సాయంతో దుకాణం నిర్వహణ
-మాజీల కుటుంబాలతో పోలీసుల కార్యక్రమాలు
నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:మావోయిస్టులు జనజీవనంలోకి రావాలని వారి కుటుంబ సభ్యులతో పాటు, పోలీసులు కోరుతున్నా రు. లొంగిపోయే మావోయిస్టులకు ప్రభుత్వం నుం చి సాయం అందజేస్తామని హామీనిస్తున్నారు. తాజా గా.. కేంద్రకమిటీ సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా కీలక హోదాల్లో ఉన్న ఒగ్గు సట్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ కిరణ్ సోమవారం జా ర్ఖండ్‌లోని రాంఛీ పోలీసులకు లొంగిపోయారు. ఇ ప్పటికే కడెం మండలం లక్ష్మిపూర్‌కు చెందిన కంతి రవి 2016 అక్టోబర్‌లో పోలీసులకు లొంగిపోయా రు. దీంతో ఈయనకు ప్రభుత్వం నుంచి రుణం మం జూరు చేయించగా.. దుకాణం నిర్వహిస్తున్నాడు. ఉమ్మడి జిల్లాలో మరో 21మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలో పలువురు వ్యక్తులు అజ్ఞాతంలో ఉండగా.. ఇందులో ఒగ్గు సట్వాజీ, ఇర్రి మోహన్‌రెడ్డి, కట్కం సుదర్శన్ కీలకం గా ఉన్నారు. మావోయిస్టులు జనజీవనంలోకి కలువాలని కోరుతూ పోలీసులు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. మావోయిస్టు కుటుంబాలు, మాజీ మావోయిస్టు కుటుంబాలతో అప్యాయంగా ఉం టూ.. వారి కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. మావోయిస్టు కుటుంబ సభ్యులకు నిత్యావసర సరుకులు, దుస్తులు పంపిణీ చేయడంతో పాటు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మావోయి స్టు, మారుమూల అటవీ, గ్రామీణ ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. పెంబి మండలంలో ఇప్పటికే రోడ్డు, వంతెన నిర్మించారు. ప్రజలతో పోలీసులు మమేకం అవుతుండగా.. లొంగిపోవాలని మావోయిస్టులకు సూచిస్తున్నారు.

ఒకరిపై రూ.25లక్షలు.ఇద్దరిపై రూ.20లక్షల రివార్డు
నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన ఒగ్గు స ట్వాజీ అలియాస్ సుధాకర్ అలియాస్ కేంద్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడిగా ఉం డగా.. రాంఛీ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది. ఆయన తర్వాత మరికొందరు మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతలుగా ఉన్నారు. బెల్లపల్లికి మండలం కన్నాలబస్తీకి చెందిన కట్కం సుదర్శన్ అలియాస్ ఆనంద్ (65) ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ మిలిటరీ కమిషన్, సెంట్రల్ రీజినల్ బ్యూరో కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇతడిపై రూ.25లక్షల రివార్డు ఉంది. మందమర్రికి చెం దిన బండి ప్రకాశ్ అలియాస్ బీపీ అలియాస్ ప్రభాకర్ అలియాస్ క్రాంతి (54) ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఆయనపై రూ.20లక్షల చొప్పున రివార్డు ఉంది. సోన్ మండలం కూచన్‌పెల్లికి చెందిన ఇర్రి మోహన్‌రెడ్డి అలియాస్ భాస్కర్ అలియాస్ ఉమేశ్ అలియాస్ మహేశ్ అలియాస్ విజయ్(60)వరంగల్‌లో రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్‌ఎస్‌యు)లో పని చేస్తూ 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తుండగా.. ఆయనపై రూ.20లక్షల రివా ర్డు ఉంది. 2009లో వరంగల్‌లో అరెస్టు అయిన మోహన్‌రెడ్డి జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాక.. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లోనే ఎక్కువ మంది..!
కోటపల్లి మండలం బబ్బెరచెల్కకు చెందిన మూల దేవేందర్‌రెడ్డి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉ న్నారు. ఆయనపై రూ.10లక్షల రివార్డు ఉంది. బో థ్ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్(48) ఆంధ్రప్రదేశ్‌లో రా ష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పెంచికల్‌పేట్ మండలం కొండపల్లికి చెందిన గడ్డం మధుకర్ ఛత్తీస్‌గఢ్‌లో కమ్యూనికేషన్ ఏరియా మెంబర్‌గా ఉన్నా రు. వీరిద్దరిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. కోటపల్లి మండలం పారెపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బెల్లంపల్లి మండల కన్నాలబస్తీకి చెందిన స లకల సరోజ ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ టెక్నికల్ కమిటీలో ఉన్నారు. బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెం దిన జాడి వెంకట్, జాడి పుష్పలు ఛత్తీస్‌గఢ్ సీటీసీ డీకే ఏరియా కమిటీ సభ్యులుగా ఉన్నారు. బెల్లంపల్లి మండలం కన్నాలబస్తీకి చెందిన కాసరవేణి రవి ఛత్తీస్‌గఢ్ డీకే ఏరియా సభ్యుడిగా పని చేస్తున్నారు. లక్సెట్టిపేటకు చెందిన అర్జున్ అలియాస్ మధు మహారాష్ట్రలోని సూరత్ జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బ జార్‌హత్నూర్ మండలం డేగ్రాకు చెందిన దాశవార్ సుమన ఛత్తీస్‌గఢ్‌లోని డీకేస్‌జడీసీ సభ్యురాలిగా ఉ న్నారు. వీరందరిపై రూ.5లక్షల చొప్పున రివార్డు ఉంది.

సోదరుడు జనంలో.. సోదరి వనంలో..!
కడెం మండలం లక్ష్మిపూర్‌కు చెందిన కంతి రవి ఇ ప్పటికే లొంగిపోగా.. ఆయనకు సర్కారు నుంచి ఆర్థి క సాయం అందటంతో దుకాణం పెట్టుకుని జనం మధ్య నివసిస్తున్నారు. ఆయన సోదరి కంతి లింగవ్వ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి ఏరియా దళ కమాండర్‌గా పని చేస్తోంది. 2002 సోఫీనగర్ పట్టుబడగా.. మళ్లీ 2003లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. బెల్లంపల్లి శాంతిఖనికి చెందిన అరెపల్లి కృష్ణ ఛత్తీస్‌గఢ్‌లో డీకే ఏరియా కమాండర్‌గా ఉన్నారు. మామడ మండలం బూర్గుపల్లికి చెందిన పెండ్రం జైతుబాయి 15 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండగా.. ప్రస్తుతం జార్ఖండ్‌లో పని చే స్తోంది. పెంచికల్‌పేట్ మండలం అగ్గర్‌గూడకు చెం దిన చౌదరి అంకుబాయి ఛత్తీస్‌గఢ్‌లో సెంట్రల్ టెక్నికల్ కమిటీలో పని చేస్తున్నారు. వీరందరిపై రూ.4లక్షల చొప్పున రివార్డు ఉంది. కడెం మండలం ఆలంపల్లి అనుబంధ గ్రామమైన గంగన్నపేట్‌కు చెందిన సోయం గోసుబాయి 2001 నుంచి అజ్ఞాతంలో ఉం ది. ప్రస్తుతం జార్ఖండ్‌లో పనిచేస్తుండగా.. రూ.3లక్షల రివార్డు ఉంది. పెంబి మండలం బావాపూర్-రాజురాకు చెందిన తూం శ్రీనివాస్ ఛత్తీస్‌గఢ్‌లోని డీకేస్‌జడీసీ సభ్యుడిగా పని చేస్తున్నారు. మందమర్రికి చెందిన బబ్బెర్ రవిబావు ఛత్తీస్‌గఢ్‌లోని డీకేస్‌జెడ్పీ సభ్యుడిగా ఉన్నారు. వీరిద్దరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉంది. ఖానాపూర్ మండలం సోమార్‌పేట్ కొలాంగూడకు చెందిన ఆత్రం శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles