ఉజ్వలను సద్వినియోగం చేసుకోవాలి

Wed,February 13, 2019 12:26 AM

-ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-121 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల అందజేత
సిర్పూర్(టి): ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సూచించారు. మండలకేంద్రంలోని సిర్పూర్(టి) హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంగళవారం గ్యాస్ కనెక్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు వంట చేసేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా గ్యాస్‌కనెక్షన్‌లను అందజేస్తున్నదన్నారు. అర్హులైన 121 మంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో సిర్పూర్(టి) సర్పంచ్ సయ్యద్ తఫిమా పర్వీన్ కిజర్, జడ్పీటీసీ అజ్మీరా రాంనాయక్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ నీరటి సత్యనారాయణ, ఎంపీటీసీ నగరాడె స్వాతి, టీఆర్‌ఎస్ మండల నాయకులు సయ్యద్ కిజర్ హుస్సేన్, అఫ్ఫర్‌ఖాన్, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు చౌదరి, ఇఫ్పత్ హుస్సేన్, నానాజీ, దౌలత్, సంతోష్, పిప్రె రాం దాస్, అశిక్ హుస్సేన్, ఇన్‌చార్జ్ ఎంపీడీవో సాయిశ్రీ, సిర్పూర్(టి) హెచ్‌పీ గ్యాస్ డీలర్ ఖుర్షీద్ హుస్సేన్, మేనెజర్ అజహర్‌హుస్సేన్, మోయిజ్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles