మరుగుదొడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలి

Wed,February 13, 2019 12:26 AM

సిర్పూర్(యు): మరుగుదొడ్ల నిర్మాణంపై సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్లాలని ఎంపీడీఓ శశికళ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సిర్పూర్, లింగాపూర్ మండలాల సర్పంచులకు స్వచ్ఛ భారత్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాలనే లక్ష్యంతో స్వచ్ఛభారత్ పేరిట నిధులు మంజూరు చేస్తుందన్నారు. మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12వేలు రెండు దఫాలుగా చెల్లిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే నిధులు సర్పంచుల జాయింట్ ఖాతాలో జమ చేశామన్నారు. ఇప్పటికి మండలంలో అనేక చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయనీ, కొన్ని గ్రామాల్లో నిర్మాణం కొనసాగుతుందన్నారు. సర్పంచులు ప్రత్యేక చొరవ తీసుకోని నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నూతనంగా గెలుపొందిన సర్పంచులకు ఈ నెల 21 నుంచి 25 వరకు జిల్లా కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఈఓపీఆర్డీ కొడప ఆనంద్‌రావ్ అన్నారు. ఈ తరగతులకు సర్పంచులు హాజరుకావాలని సూచించారు. సమావేశంలో ఈజీఎస్ ఏపీఓ లింగంపల్లి చంద్రయ్య, సర్పంచులు ఆత్రం వీణబాయి, ఆత్రం జాలీంషావ్, కుంర గంగాదేవి, పద్మ, కోవ నాందేవ్, రాజేశ్, ఉదయసింగ్, భూపతి పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles