నాగోబానమో నమ

Mon,February 11, 2019 11:29 PM

-భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం
-దర్శించుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి
-నేటితో ముగియనున్న కెస్లాపూర్ జాతర
-రేపు హుండీ లెక్కింపు
ఇంద్రవెల్లి(ఆదిలాబాద్ జిల్లా): కెస్లాపూర్ నాగోబాను వందలాదిమంది భక్తులు సోమవారం ద ర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తు లు ఎడ్లబండ్లు, ప్రత్యేక వాహనాలతో కుటుంబసమేతంగా తరలివచ్చి నాగోబాను దర్శించుకున్నా రు. జాతర పరిసరాలు భక్తులతో కిక్కిరిశా యి.
తరలివచ్చిన ప్రముఖులు
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ నాగోబాను దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎ మ్మెల్యే రేఖానాయక్‌ను మెస్రం వంశీయులతోపా టు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సన్మా నించి, నాగోబా ఫోటోను బహుకరించారు. డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ స భ్యురాలు సుహాసినిరెడ్డి, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, వేర్వేరుగా దర్శించుకున్నారు. ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, జడ్పీటీసీ సంగీత, కెస్లాపూ ర్ సర్పంచ్ మెస్రం రేణుకాబాయి, ఇంద్రవెల్లి సర్పంచ్ కోరెంగా గాంధారి, బిక్కుతం డా సర్పంచ్ ఆడే విజయ, టీఆర్‌ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు సుకేష్న, ఆలయ కమిటీ చై ర్మన్ మెస్రం ఆనంద్‌రావ్, ఈవో రాజమౌళి, మాజి సర్పంచ్ మెస్రం నాగ్‌నాథ్, టీఆర్‌ఎస్ పార్టీ మం డల శాఖ నాయకులు సుఫియాన్, మారుతీ, అం జద్, నగేశ్, శ్రీనివాస్, తదితరులున్నారు.
నేటితో ముగియనున్న జాతర
ఈ నెల 4న ప్రారంభమైన కెస్లాపూర్ నాగోబా జాతర మంగళవారంతో ముగియనున్నది. దేశ విదేశీయులు కెస్లాపూర్‌కు తరలిరాగా, జాతర వైభవంగా నిర్వహించారు.
రేపు హుండీ లెక్కింపు..
నాగోబా భక్తులు కానుకలుగా వేసిన హుండీ లెక్కింపు ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రాజామౌళి తెలిపారు. నాగోబా హుండీ లెక్కింపు ఐటీడీఏ, రెవెన్యూ, పోలీస్, దేవదాయ శాఖ, ఆలయ కమిటీ, మెస్రం వంశీయుల సమక్షంలో నిర్వహించడం జరగుతుందని ఆయన పేర్కొన్నారు.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles