రక్తదానం ప్రాణదానంతో సమానం

Mon,February 11, 2019 11:27 PM

మంచిర్యాల స్పోర్ట్స్ : రక్తదానం ప్రాణదానంతో సమానమమని డీసీపీ వేణుగోపాల్‌రావు అన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎఫ్‌సీఏ ఫంక్షన్‌హాలో రవాణాశాఖ అధికారులు సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ వేణుగోపాల్‌రావు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు జిల్లాలో విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రవాణాశాఖ అధికారులు అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరుగకుండా తమవంతు కృషి చేయాలని ఏసీపీ గౌస్‌బాబా కోరారు. కలెక్టర్ భారతిహోళికేరి, జిల్లాలోని పోలీస్ అధికారులు,అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు,అన్ని వర్గాల ప్రజల సహకారంతో రోడ్డు భద్రత వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని డీటీఓ కిష్టయ్య తెలిపారు. రోడ్డు భద్రత నియయాలను సీనియర్ ఎంవీఐ వివేకానందరెడ్డి వివరించారు. రోడ్డు భద్రత నియమాల స్టిక్కర్లను విడుదల చేశారు. జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ సత్యనారాయణరెడ్డి, ఎంవీఐ వివేకానందరెడ్డి ముందుగా రక్తదానం చేసి ప్రోత్సహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల డ్రైవర్లు, క్లీనర్స్, ఎంసీసీ, ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, ప్రత్యూష ఉన్నారు.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles