బ్రహ్మోత్సవాలకు వేళాయె

Mon,February 11, 2019 11:27 PM

దండేపల్లి: దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.ఆలయంలో ఈనెల 13 నుండి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ నెల 13 నుండి 20 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఆలయాన్నీ ముస్తాబు చేస్తున్నారు.
16 న స్వామివారి కళ్యాణం..
ఈ నెల 16న శనివారం రాత్రి గోధూళిక సుముహూర్తాన సత్యనారాయణ స్వామి కళ్యాణం, 19న మాఘశుద్ది పౌర్ణమి జాతర నిర్వహించనున్నారు.13 నుండి 15వరకు ఆలయం లో నిత్యవిధి ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, విశ్వక్సేనారాధన, దీక్ష కంకణాధారణ, నిరంతర సప్తాహ భజనలు, ఈనెల 17న నిత్యవిధి, ప్రాభోధిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్టి, 18న నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్టి, నవగ్రహ హోమం, పంచసూక్త హోమాలు, నిత్యహోమాలు, బలిహరణం, 19న మాఘశుద్ద పౌర్ణమి జాతర సందర్భంగా నిత్యవిధి ప్రాభోదిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, హోమం, నిత్యహోమాలు, జయాది హోమం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి బలిహరణము, స్వామివారిసేవా ఉత్సవం,20న స్వామివారి రథోత్సవం, సప్తాహ భజన, ఏకాంతసేవతో స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆలయ ఈఓ నారాయణ, వ్యవస్థాపక కుటుంబ సభ్యులు తెలిపారు.
దేవస్థానంలో ఏర్పాట్లు...
స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భం గా ప్రధాన ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ సత్యనారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాల ను రంగురంగు విద్యూత్ దీపాలతో అలంకరిస్తున్నారు.స్వామివారి కళ్యాణం కోసం భక్తులు రూ.500 కళ్యాణ రుసుం చెల్లించి రసీదు పొందాలన్నారు.స్వామివారి కళ్యాణాన్నీ వీక్షించేందుకు భక్తులకు ఎల్‌ఈడీలను ఏర్పాటు చేయనున్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles