విజయవంతం చేయండి

Mon,February 11, 2019 11:27 PM

మంచిర్యాల రూరల్: వైద్య, శిశు సంక్షేమ శాఖ ల సంయుక్త ఆధ్వర్వంలో జాతీయ నులి పురుగుల దినోత్సం, పల్స్ పొలియోను విజయవంతం చేయాలని కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా జా యింట్ కలెక్టర్ సురేందర్ రావుతో కలసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ఐదేండ్లలోపు వయస్సు గల పిల్లల వివరాలు, పాఠశాలలో చదవని పిల్లలు సుమారు 15 వేల మంది వరకు ఉంటారనీ, వారికి జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా సరిపడా మాత్రలు అందుబాటులో ఉం చుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సారి 100 శాతం చేయాలనీ, మాత్ర వేసిన వెంటనే మింగకుండా చప్పరించేలా పిల్లలకు అర్థమైయ్యేలా వివరించాలన్నారు. పాఠశాలల్లో ప్రార్థ నా గీత సమయంలో పాఠశాల బోర్డుపై నులి పురుగుల దినోత్సవం, పోలియో చుక్కల తేదీలను రాసి పిల్లలకు అవగామన కల్పించాలన్నారు. సుమారు జిల్లాలో 3 లక్షలకు పైబడి విద్యార్థులు ఉంటారని వారందరికి మాత్రలు అందేలా గ్రామీ ణ, పట్టణ ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలన్నా రు. అంగన్‌వాడీ, ఆశా, విద్యాశాఖ, సంబంధిత శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనీ, పిల్లలకు అవగాహన కోసం వ్యాస రచన, ఉపన్యాస, పోటీలతో పాటు ర్యా లీలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పిల్లలకు పరిశుభ్రతతో పాటు బహిరంగ మల, మూత్ర విసర్జనతో కలిగే అనర్థాలను వివరించాలని తెలిపారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వైద్యాధికారులు, ఐసీడీఎస్ సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. జిల్లా వైద్యాధికారి భీష్మ, జిల్లా విధ్యాశాఖ అధికారి రషీద్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి శ్యామలాదేవి, మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రవూఫ్ ఖాన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

158
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles