మున్నూరు కాపుల అభివృద్ధికి కృషి చేయాలి

Mon,February 11, 2019 11:26 PM

రెబ్బెన: మున్నూరుకాపుల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎంపీపీ కార్నాథం సంజీవ్‌కుమార్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు, మున్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ కోరారు. రెబ్బెన మండల కేంద్రం లో సోమవా రం మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నంబాల సర్పంచ్ చెన్న సోమశేఖర్, రాజారం సర్పంచ్ ఓరగంటి మల్లేశ్, కైర్‌గాం సర్పంచ్ మానెం కార్తీక్‌తో పాటు ఉపసర్పంచ్ లను పూలమాలలు వేసి శాలువలు కప్పి ఘనంగా స న్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మామిడి శేఖర్, పూదరి సాయికిరణ్, సృజన్, కుందా రపు బాలకృష్ణ, సత్తయ్య, గజ్జల రామయ్య ఉన్నారు.
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆసిఫాబాద్, నమస్తే తెలంగాణ: మున్నూర్ కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సం ఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగామ రాజారాం కోరారు. సోమవారం సంఘం అధ్వర్యంలో జాయిం ట్ కలెక్టర్ రాంబాబుకు వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మున్నూరు కాపులు ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. మున్నూరు కాపుల సంక్షేమానికి రాజధానిలో ఐదెకరాల భూమి , రూ. ఐదు కోట్ల ఇచ్చిన ప్ర భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తె లుపుతున్నామన్నారు. కాచిగూడలోని మున్నూర్ కాపు విద్యార్ధి వసతి గృహ ట్రస్ట్‌ను ఎండోమెంట్ నుంచి తొలగించి, నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తే కాపు సంఘం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా యువజన సంఘం ఆధ్యక్షుడు గడ్డల సురేష్, కోషాధికారి సతీస్,ప్రచార కార్యదర్శి వెంకటేశం, సర్పంచ్ భూసీ భీమే ష్,నాయకులు పిడుగు తిరుపతి,పెద్దపల్లి శ్రీనివాస్,తిరుపతి,శంకర్ తదితరులున్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles