స్టాంపుల విక్రయాల్లో స్వాహా పర్వం

Thu,January 24, 2019 02:03 AM

-రూ.78 లక్షలు నొక్కేసిన అక్రమార్కులు
-ఆదిలాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా భారీ అవినీతి
-అధికారుల తనిఖీల్లో బట్టబయలు
-ఐదుగురి సస్పెన్షన్, ఇద్దరి అరెస్ట్
-మరింత లోతైన విచారణకు ఉన్నతాధికారుల ఆదేశం
ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి వెలుగుచూసింది. లక్షల రూపాయల విలువ చేసే స్టాం పుల విక్రయాల్లో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారుల తనిఖీల్లో బయడపడింది. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అడిగినన్ని స్టాంపులు ఇచ్చినా, వాటిలో ఎన్ని విక్రయించా రు.. వచ్చిన డబ్బులను ఏ ఖాతాల్లో జమచేశారనే వివరాలు లేవు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు భారీగా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల అధికారులు జరిపిన తనిఖీల్లో రూ.78 లక్షల లెక్కలు తేలకపోవడంతో ఇందుకు బాధ్యులుగా ఐదుగురు అధికారులు, ఇద్దరు సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధి లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బోథ్, భైంసా, నిర్మల్, ఖానాపూర్, లక్షెట్టిపేట, మంచిర్యాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. భూములు, ఇం టి రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాలకు స్టాంపులు విక్రయిస్తారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా స్టాంపులను కూడా జిల్లా కార్యాలయంలోని స్టాం పు డిపో నుంచి తీసుకుపోతారు. స్టాంపుల విక్రయాల వారీగా వచ్చిన డబ్బులను రాష్ట్ర శాఖ కా ర్యాలయం ఖాతాలో జమ చేయాలి. జిల్లా రిజిస్ట్రా ర్ కార్యాలయంలో నాలుగేళ్లుగా స్టాంపులు డిపో నుంచి జారీ చేయగా ఇందుకు సంబంధించిన వి వరాలు లేకపోవడం అధికారులు, సిబ్బంది కలిసి అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి స్టాంపులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపడం తప్ప కనీసం వివరాలు, రికార్డులు కూడా నిర్వహించక భారీ అవినీతికి తెరలేపారు.

ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి డబ్బులను కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్టాంపులు విక్రయించగా వచ్చిన డబ్బులను వాటాలుగా పంచుకుంటూ చలనా రూపంలో విక్రయిస్తున్నట్లు లెక్కలు చూపుతూ వచ్చారు. ఇటీవల సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు స్వీకరించిన అధికారి ఈ వ్యవహారంపై అనుమానం రావడంతో ఆమె ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు విచారణ జరుపగా భారీ కుంభకోణం బయటపడింది. ఐదుగురు అధికారులతో పాటు ఓ క్లర్క్, మరో క్యాషియర్ ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రూ. 78 లక్షల అవినీతి..
2014 నుంచి 2018 వరకు జరిగిన స్టాంపుల విక్రయాల్లో రూ.78 లక్షల వరకు అవినీతి జరిగినట్లు అధికారుల విచారణలో బయటపడింది. స్టాంపుల విక్రయాల్లో వచ్చిన డబ్బులను ప్రభుత్వ ఖాతాల్లో జమచేయకుండా అధికారులు, సిబ్బం ది కలిసి జేబుల్లో వేసుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం జిల్లా రిజిస్టేషన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ కరీంనగర్ డీఐజీ ట్వింకల్ జాన్, అడిషనల్ డీఐజీ వెంకట్ తనిఖీ చేసి, పలు పత్రాలను తమ వెంట తీసుకెళ్లారు. ఈ బాగోతంపై అధికారులు లోతుగా విచారణ జరుపనున్నారు.
ఐదుగురి సస్పెన్షన్.. ఇద్దరి అరెస్ట్
ఎదులాపురం: ఈ అక్రమాలకు సంబంధించి అధికారులు ఏడుగురిపై చర్యలు తీసుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు స్టాంపుల కౌంటర్ క్లర్క్ కపిల్ క్యాషియర్ ఇంతియాజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇమ్రాన్, సాయినాథ్, లక్షెట్టిపేట జూనియర్ అసిస్టెంట్ అరుణ్ సబ్ రిజిస్ట్రార్ చంద్రశేఖర్ సస్పెండ్ చేశారు. రిజిస్ట్రార్ జైవంత్ తగు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు.

96
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles