శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

Thu,January 24, 2019 02:00 AM

-డీఎస్పీ సాంబయ్య
కాగజ్ రూరల్ : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కాగజ్ డీఎస్పీ సాంబయ్య అన్నారు. కాగజ్ రూరల్ పోలీస్ ఆవరణలో బుధవారం పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలింగ్ బూత్ సెల్ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నరన్న సమాచారం మేరకు రాత్రివేళలో పెట్రోలింగ్ పెంచామని తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని వివరించారు. పోలింగ్ సమయంలో పోలింగ్ స్టేషన్ 100 మీటర్ల దూరంలోనే అభ్యర్థులు, వారి అనుచరులు ఉండాలని సూచించారు. వికలాంగులు, చిన్నపిల్లలు ఉన్న మహిళలు, వృద్ధులకు సాయంగా ఒకరిని అనుమతించాలన్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమంచకుండా బందోబస్తు నియమిస్తామని తెలిపారు. మండలంలో ఎన్నికలను ప్రశాంతంగా చేపట్టేందుకు సిబ్బందికి సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు, ప్రజలు పోలీసు సిబ్బందికి సహకారం అందించాలని కోరారు. రూరల్ సీఐ వెంకటేశ్, రూరల్ ఎస్ ఉపేంద్రచారి, దహెగాం సీఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles