వైభవంగా ఖాందేవ్ జాతర

Wed,January 23, 2019 01:55 AM

-తొడసం వంశస్తుల పూజలతో ప్రారంభం
-ముఖ్యఅతిథిగా ఆత్రం సక్కు
-పక్క రాష్ర్టాల నుంచి తరలివచ్చిన భక్తులు
-ఆకట్టుకున్న సాంస్కృతిక నృత్యాలు
-రెండు కిలోల నువ్వుల నూనె తాగిన అనవంతుబాయి
నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో ఖాందేవ్ జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం అర్ధరాత్రి తొడసం వంశీయుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, షురూ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆలయంలో ఆ వంశ ఆడపడుచుకు నూనె తాగించే మహోన్నత కార్యక్రమం నిర్వహించారు. ఖైరదట్వా గ్రామానికి చెందిన ఆడపడుచు మడావి అనవంతుబాయి రెండు కిలోల నూను తాగింది. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయనతో పాటు ఉట్నూర్ డీఎస్పీ వెంకటేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులను ఘనంగా సన్మానించారు. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ర్టాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఆడబిడ్డలకు ఎమ్మెల్యే కానుకలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి ఖామ్ము పటేల్, తహసీల్దార్ శంకరయ్య, నార్నూర్ సీఐ హనుక్, ఎంపీటీసీ ఆడే సురేశ్, బానోత్ జాలంసింగ్, ఆలయ చైర్మన్ మెస్రం నానాజీ, నిర్వాహకుడు తొడసం నాగోరావ్, మాజీ ఎంపీపీ మెస్రం రూప్ తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మెస్రం శేఖర్, తుడుందెబ్బ గౌరవ అధ్యక్షుడు మడావి మాన్కు, దస్తగిరి, తదితరులున్నారు. ఈ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ పర్యవేక్షణ ఏర్పాటు చేశామని డీఎస్పీ వెంకటేశ్ తెలిపారు. ఈయన వెంట నార్నూర్ ఎస్ విజ, గాదిగూడ ఎస్ సుబ్బారావ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles