ముగిసిన ఉపసంహరణ

Wed,January 23, 2019 01:53 AM

వాంకిడి: మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా 128 మంది నామినేషన్లు వేశారు. ఇందులో నాలుగు తిరస్క రించగా, 24 మంది ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. దీంట్లో ఏడు గ్రామాలు ఏకగ్రీవం కాగా, ఒకటి నామినేషన్ రాలేదు. మిగితా 20 గ్రామాలకు 93 మంది బరి లో ఉన్నట్లు ఎన్నికల అధికారి మహేందర్ తెలిపారు. సర్పంచ్ బరిలో వాంకిడిలో 18, జంబుల్ 3, బంబారలో 7, బెం డారలో 6, చిచ్ 2, చౌపన్ 3, గోయగాంలో 2, ఇందానిలో 2, జైత్ ర్ 4, ఖనర్ 3, ఖమానలో 5, ఖిర్డిలో 3, కోమటి గూడలో 2, లక్ష్మిపూర్ 6, నవేధరిలో 5, నవేగాంలో 2, సా మెలలో 3, సరండిలో 9, సోనాపూర్ 4, వెల్గిలో 4, మొత్తం 93 మంది సర్పంచ్ బరిలో పోటీ చే యనున్నారు. కాగా 236 వార్డులకు గానూ 115 వార్డులు ఏ కగ్రీవం కాగా 121 వార్డుల కు పోటీ జరుగనుంది.
సిర్పూర్(యు): మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల నా మినేషన్ల ప్రక్రియ మంగళవారం ముగిసింది. 13 సర్పంచు స్థా నాల్లో పోటీ చేయడానికి 41 మంది సర్పంచు సభ్యులు బరిలో ఉన్నారు. మండలంలో 15 గ్రామ పంచాయతీలుండగా బాండే యేర్, సీతాగోంది గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక నిర్వ హించారు. మిగతా 13 గ్రామ పంచాయతీలకు 41 మంది బరి లో నిలిచారు. మండలంలో 124 వార్డులకు గాను 99 వా ర్డుల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 25 వార్డులకు 61 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. కాగా ఏకగ్రీవమైన అభ్యర్థులకు అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
లింగాపూర్: మండలంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఉపసంహరణ పక్రియ మంగళవారంతో ముగిసింది. 14 గ్రామ పంచాయతీల్లో మూడు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో హూ మ్నూర్, పిక్లాతాండా, లోద్దిగూడా ఉన్నాయి. మిగితా 11 జీపీ లకు 33 మంది సర్పంచ్ అభ్య ర్థులు బరిలో నిలిచారు. వీరిలో 118 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు.
జైనూర్: మూడో విడతలో భాగంగా శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన పూర్తయింది. మండల వ్యాప్తంగా 26 గ్రా మపంచాయతీలు, 222 వార్డు స్థానాలున్నాయి. మండలం లో 7 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. మండలంలోని మార్లవాయిలో కనక ప్రతిభ, దుబ్బగూడాలో మడావి భీంరావ్, పారాలో మెస్రం గోవింద్ ఉషెగాంలో రమాకాంత్, పవర్ గెడాం వనిత, రాసిమెట్టలో గిరిజ బాయి, రామునాయక్ సవిత రాందాస్ ఏ కగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగితా 19 స్థానాలకు 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 222 వార్డు స్థానాలకు రెండింటికి నామినేషన్లు రాలేదు. మిగితా 220 వార్డుల్లో 176 ఏకగ్రీవం కాగా, 46 వార్డు స్థానాలకు గాను 115 మంది పోటీలో ఉన్న ట్లు ఎంపీడీవో బానోవత్ దత్తరాం తెలిపారు.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles