గులాబీ గుబాళింపు

Tue,January 22, 2019 01:15 AM

-మొదటి విడత జీపీ ఎన్నికల్లో కారు జోరు
-78 స్థానాల్లో టీఆర్ మద్దతుదారులు గెలుపు
-ఊరూరా అభ్యర్థులు, శ్రేణుల సంబురాలు
-ప్రశాంతంగా ముగిసిన ఓటింగ్..
-ఆరు మండలాల్లో 86.71 శాతం పోలింగ్
-ఓటింగ్ మహిళలదే అత్యధికం
-పోలీసుల పటిష్ట బందోబస్తు
-పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ హన్మంతు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో సోమవారం మొదటి విడత ఎన్నికలు నిర్వహించగా, 113 గ్రామ పంచాయతీల్లో.. 78 జీపీలను టీఆర్ కైవసం చేసుకుంది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, పల్లె ఓటర్లు కేంద్రాల ముందు బారులు తీరారు. 86.71 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు, ఆ తర్వాత ఫలితాలను విడుదల చేశారు. 113 గ్రామ పంచాయతీల్లో 18 గ్రామ పంచాయతీలు టీఆర్ ఖాతాలో ఏకగ్రీవం కాగా, సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో 60 గ్రామ పంచాయతీల్లో టీఆర్ మద్దతుదారులు గెలుపొందారు. 113 జీపీల్లో.. 78 జీపీలను టీఆర్ అభ్యర్థులు గెలుపొందగా, కాంగ్రెస్ మద్దతు దారులు 24 మంది, స్వతంత్రులు 11 మంది గెలుపొందారు.

86.71 శాతం పోలింగ్...
మొదటి విడతలో 113 గ్రామ పంచాయతీలో జరిగిన ఎన్నికల్లో పల్లె ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటంతో చైతన్యం కనబరిచారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొదటి విడతలో ఆరు మండలాల్లో 1,00,173 మంది ఓటర్లకుగాను, 86,856 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుష ఓటర్లు 50,596 మంది కాగా, 44,024 మంది ఓట్లు వేశారు. మహిళా ఓటర్లు 49,560 మంది ఉండగా, 42,828 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇతరులు 17 మంది ఉండగా, నలుగురు ఓటు వేశారు. అత్యధికంగా దహెగాం మండలంలో 92.42 శాతం ఓటింగ్ నమోదు కాగా, కౌటాల మండలంలో తక్కువగా 83.52 శాతం పోలింగ్ నమోదైంది. బెజ్జూర్ మండలంలో 86.31 శాతం, పెంచికల్ మండలంలో 89.02 శాతం, చింతలమానెపల్లిలో 89.45 శాతం, సిర్పూర్-టి మండలంలో 87.83 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 14.50 శాతం నమోదు కాగా, తర్వాత పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 63.32 శాతం కాగా, ఒంటి గంట వరకు 77.80 నమోదైంది.

78 పంచాయతీల్లో గులాబీ జెండా...
పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా గ్రామ గ్రామాన ఎగిరింది. సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 113 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ పార్టీ మద్దతు దారులు 78 పంచాయతీల్లో గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతు దారులు 24 స్థానాలు, స్వతంత్య్ర అభ్యర్థులు 11 స్థానాలో గెలుపొందారు. మొదటి విడతలోని 113 స్థానాల్లో 18 స్థానాలు టీఆర్ ఏకగ్రీవం కాగా, సోమవారం జరిగిన ఎన్నికల్లో 60 స్థానాలు గెలుపొందింది.
ఊరూరా సంబురాలు.
మొదటి విడత జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు టీఆర్ మద్దతు దారులు గెలుపొందడంతో అభ్యర్థులు, టీఆర్ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచే ఒక్కొక్కటిగా పంచాయతీ ఫలితాలు వెలువడగా, శ్రేణుల్లో ఆనందంలో మునిగితేలారు. బ్యాండు మేళాలతో విజయోత్సవ ర్యాలీలు తీశారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
కౌటాల, చింతలమానెపల్లి, సిర్పూర్-టి, పెంచికల్ దహెగాం, బెజ్జూర్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, జేసీ రాంబాబు, ఏఎస్పీ గోద్రు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, ఆ వెంటనే ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలకు సంబంధించి అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు.
భారీ బందోబస్తు
గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా సమస్యాత్మక కేంద్రాలే ఉండడంతో పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. కౌటాల మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రం వద్ద కొంత మంది ఓటర్లతో పాటు వరుసల్లో నిలబడి ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు గటిబందో బస్తు ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాతంగా జరిగేలా చర్యలు చేపట్టారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles