లోటుపాట్లను సవరించేందుకే తనిఖీలు

Tue,January 22, 2019 01:13 AM

జైపూర్ : గనులు, పని స్థలాల్లో లోటు పాట్లను సవరించేలా చర్యలు తీసుకునేందుకే తనిఖీ చేపట్టినట్లు పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రీషియన్) పేర్కొన్నారు. శ్రీరాంపూర్ డివిజన్ ఇందారం ఖని 1ఏ గనిని సోమవారం పిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రీషియన్) సందర్శించారు. సభ్యులు గనిలోని పని స్థలాలను పరిశీలించారు. 3సీం, ఎన్ ప్యానల్ జరుగుతున్న బ్లాస్టింగ్, సపోర్టింగ్, ఫేస్ ఎస్ మిషన్స్ కోల్ లోడింగ్, హలేజ్ సర్క్యూట్ పనులను పరిశీలించారు. రక్షణ చర్యలు ఎలా ఉన్నాయని స్థానికంగా అధికారులు అడిగి తెలుసుకున్నారు. కమిటీ సభ్యులు ఈ తనిఖీలు మూడు రోజులపాటు నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు. లోటు పాట్లు గమనించిన తనిఖీ బృందం సభ్యులు రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు ఏ రాజమల్లు (మైనింగ్ వర్క్ ఇన్ ఎస్ తిరుపతిరెడ్డి (మెకానికల్ వర్క్ ఇన్ ఆదిరెడ్డి (ఎలక్ట్రికల్ వర్క్ ఇన్ ఆర్ కుమార్ (టింబర్ పీఎస్ మెంబర్), ఎండీ హైదర్ సీనియర్ పీఎస్ మెంబర్లు, పీఓ రాజేశ్వర్ గనిమేనేజర్ బీ ఓదెలు, ఇన్ మేనేజర్ బీ రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles