పోలింగ్ ప్రశాంతం

Tue,January 22, 2019 01:13 AM

-ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
-ఆరు మండలాల్లో 86.71 శాతం
-ఓటింగ్ మహిళలే అత్యధికం
-కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ హన్మంతు
-పోలీసుల పటిష్ట బందోబస్తు
మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం ఉదయం నుంచి ఓటర్లు బారులుదీరారు. సిర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగగా, ఉదయం నుంచే ప్రజలు బారులుదీరారు. జిల్లా వ్యాప్తంగా 86.71 శాతం పోలింగ్ నమోదు కాగా, పురుషులకంటే మహిళలే అత్యధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ రాజీవ్ హన్మంతు, జేసీ రాంబాబు, ఏఎస్పీ గోద్రు కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగగా, రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమైంది. అనంతరం గెలిచిన అభ్యర్థులు సంబురాల్లో మునిగితేలారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles