పేదింటి ఆణిముత్యం

Mon,January 21, 2019 12:20 AM

కోటపల్లి: పేదింటి ఆణిముత్యం జాతీయ స్థాయిలో రాణించింది. పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఈ నెల 12న సిద్దిపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో కోటపల్లి మం డలం ఆలుగామకు చెందిన రాంటెంకి సుప్రజ ప్రతిభ చూపి బంగారు పతకం గెలుచుకుని రాష్ట్ర జట్టుకు జా తీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది.

ఆలుగామకు చెందిన రాంటెంకి బానయ్య-చిన్నక్క కూతురు సుప్రజ లక్షెట్టిపేట బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుని ఆమె తల్లిదండ్రులు కూతరు చదువు, ప్రతిభకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని లక్షెట్టిపేటలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉంచి చదివిస్తున్నారు. చదువులో ముందుండే సుప్రజ క్రీడల్లో కూడా మంచి ప్రతిభ చూపుతుంది. దీంతో పాఠశాల పీడీ రామ్మోహన్ రావు ఆమె ఆట తీరును చూసి ప్రత్యే క శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె గతేడాది నవంబర్‌లో జరిగిన స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సీసీసీలో నిర్వహించిన అండర్-17 జిల్లా స్థాయి హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికైంది. అనంతరం రాష్ట్ర జట్టుకు ఎంపికై ఈ నెల 12 నుంచి 16 వరకు జాతీయ పోటీలో పా ల్గొంది. దేశవ్యాప్తంగా 30 రాష్ర్టాల జట్లు పాల్గొనగా సుప్రజ ప్రతి విభాగంలో ప్రతిభ చూపి తెలంగాణ రాష్ట్ర టీమ్‌ను మొదటి స్థానంలో నిలిపి రాష్ట్రానికి విజయా న్ని అందించింది. జట్టులోని తోటి క్రీడాకారులను ఏకతాటిపైకి తెచ్చి విజయంలో కీలకపాత్ర పోషించిన సుప్రజ జట్టు ఫెవరెట్‌గా నిలిచింది. ఉత్తమ ప్రతిభ చూ పిన సుప్రజకు బంగారు పతకంతో పాటు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. 19న స్వగ్రామానికి వచ్చిన ఆమెను గ్రామస్తులు ఘనంగా స్వాగతించి, సన్మానించారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles