ప్రచారానికి తెర

Sun,January 20, 2019 01:23 AM

-ముగిసిన తొలివిడత జీపీ ఎన్నికల ప్రచారం
-ఈ నెల 12 నుంచి హోరెత్తిన పల్లెలు
-అభ్యర్థులకు ఆయా పార్టీల మద్దతు
-18 సర్పంచ్ స్థానాలు, 335 వార్డుల్లోటీఆర్ అభ్యర్థులు ఏకగ్రీవం
-రేపు ఆరు మండలాల్లోని 95 జీపీల్లో పోలింగ్
-సర్పంచ్ 294 మంది.. వార్డులకు 634 మంది పోటీ
-ఏర్పాట్లలో అధికారుల నిమగ్నం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మొదటి విడతలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికల ప్రచారం శనివారంతో ముగిసింది. సి ర్పూర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 113 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికే 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీ వం అయ్యాయి. ఈ నెల 21న మిగతా 95 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 95 గ్రామ పంచాయతీ ల్లో 294 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీ లో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీల్లోని 992 వా ర్డుల్లో 335 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 23 వార్డులకు నామినేషన్లు రాలేదు. మిగతా 634 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వార్డుల్లో 1,401 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారం రోజులుగా అభ్యర్థులు గెలుపుకోసం రాత్రింబవళ్లు శ్రమించారు. పంచాయతీ ఎ న్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ.. ఆ యా పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం నాయకులను రంగంలోకి దింపాయి. సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 18 సర్పంచ్ స్థానాలు, 335 వార్డుల్లో టీఆర్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు. పంచాయితీ ఎన్నికలకు 44 గంటల ముందు నుంచే ప్రచారాలను అభ్యర్థులు నిలిపివేశారు.

ముమ్మరంగా ప్రచారం..
ఈ నెల 12 నుంచి మొదటి విడత ఎన్నికల ప్రచారం మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల పెద్దల మాటలు చెల్లుబాటు అవుతుండడంతో అభ్యర్థులు ఆయా గ్రామాల్లోని పెద్దలను ప్రసన్నంచేసుకునేందు కు కృషి చేశారు. గ్రామ పంచాయతీల పునర్విభజన తో అన్ని చిన్నచిన్న గ్రామ పంచాయతీలే ఏర్పడ్డాయి. ఓటర్ల జాబితాలోని ప్రతి ఒక్కరినీ కలుస్తూ ఓట్లు అ భ్యర్థిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి సగటున ఇద్దరు .. నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డు స భ్యుల స్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు. అభ్యర్థులు కూడా తక్కువ మందే ఉండడంతో గెలుపుకోసం అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాలు చేశారు.కొత్త గ్రామ పంచాయతీల్లో పోటీ చేసే అభ్యర్థులు చాలా మంది కొత్తవారే కావడంతో ఎన్నికల ప్రచారాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అధికార టీఆర్ తరపున బరిలో నిలిచిన వారి కోసం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పార్టీ జిల్లా ఇన్ మూల విజయారెడ్డి ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రచా రం చేశారు. మద్దతు దారులు ఆయా పార్టీల నాయకుల మద్దతు తీసుకుంటూ ప్రచారంలో పాల్గొన్నారు. రెబ్బెన గ్రామ పంచాయతీలో నిర్వహించిన ప్రచారంలో శనివారం ఏఎంసీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ పాల్గొన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు
మొదటి విడత ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 95 గ్రామ పంచాయతీలు, 294 వార్డుల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా 327 మంది పోలింగ్ అధికారులు, 764 మంది ఏపీవో లు, మిగతా 1290, స్టేజ్-2 అధికారులు 125 మం దిని నియమించారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికలతో పాటు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేసే వరకు విధుల్లో ఉంటారు.

83
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles