వినియోగదారులను ఇబ్బందులు పెట్టద్దు

Sun,January 20, 2019 01:21 AM

-రాష్ట్ర హజ్ సభ్యుడు ఇంతియాజ్
జైనూర్: విద్యుత్ వినియోగదారులను ఇబ్బందులు పెట్టొద్దని రాష్ట్ర హజ్ సభ్యుడు ఇంతియాజ్ సూచించారు. మండల కేంద్రంలోని సబ్ వద్ద విద్యుత్ అధికారుల తీరు సరిగా లేదని ఆరోపిస్తూ వీకర్ సెక్షన్ కాలనీవాసులు, స్థానిక చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు. రెండు గంటల పాటు కార్యాలయంలో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ సిబ్బంది రెండు మూడు నెలలకోసారి వచ్చి మీటర్ రీడింగ్ చూడకుండానే బిల్లులు కొడుతున్నారని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర హజ్ సభ్యుడు ఇంతియాజ్ సీనియర్ నాయకుడు కోడప ప్రకాశ్ కార్యాలయానికి చేరుకుని విద్యుత్ ఏఈ సురేశ్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. విద్యుత్ సిబ్బంది వినియోగదారులను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని ఏఈని కోరారు. ఇకముందు ఇలా జరగకుండా చూస్తానని ఏఈ చెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో శాలిమార్ యువజన సంఘం మండల అధ్యక్షుడు అజ్జులాల, ఫిరోజ్ నాయకుడు అయ్యుబ్ పఠాన్ తదితరులున్నారు.

102
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles