ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించండి

Sun,January 20, 2019 01:21 AM

సిర్పూర్(టి)/ బెజ్జూర్/కౌటాల: గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కలెక్టర్ రాజీవ్ హన్మంతు అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో, బెజ్జూర్ మండలకేం ద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. కేంద్రంలోని పోలింగ్ సామగ్రితో పాటు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లపై అధికారుల ను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ఓటర్లకు, పోలింగ్ సిబ్బందికి అన్ని సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండి, విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని సూచించారు.కౌటాల మండల కేంద్రంలోని జడ్పీఎస్ సౌకర్యాలను పరిశీలించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగజ్ ఆర్డీవో శివకుమార్, తహసీల్దార్ భోజన్న, ఇన్ ఎంపీడీవో సాయిశ్రీ, సూపరింటెండెంట్ అర్జున్ బెజ్జూర్ జిల్లా సహాయ ఎన్నికల అధికారి తోటాజీ, తహసీల్దార్ లక్ష్మన్, కౌటాలలో తహసీల్దార్ యాకన్న, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎన్నికల అధికారులు మరియు రెవెన్యూ,గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles