మద్దతుదారులను గెలిపించండి

Sat,January 19, 2019 12:09 AM

దహెగాం : గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని టీఆర్‌ఎస్ యువ నాయకుడు కోనేరు వంశీ కోరారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో టీఆర్‌ఎస్ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఇం టింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయనీ, దహెగాంలో అహ్యర్థి పుప్పాల లక్ష్మిని గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు ప్రసాద్ రాజు, నాయకులు అల్గం మల్లేశ్, పుప్పాల సంతోష్, పుప్పాల శ్రీనివాస్ పాల్గొన్నారు.
పెంచికల్‌పేట్ : పంచాయతీ ఎన్నికల్లో గులాబీజెండా ఎగరాల్సిందేనని ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ అన్నారు. శుక్రవారం మండలంలోని గుంట్లపేట, పోతెపల్లిలో ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన పోతెపల్లి పంచాయతీ అభ్యర్థి బండి వెంకటచలంను సర్పంచ్‌గా గెలిపించాలని కోరారు. నాయకులు కట్ట ప్రసాద్, మండలాధ్యక్షుడు చౌదరి తిరుపతి, నాయకులు బండి మహేశ్ , ఆయా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

చింతలమానేపల్లి: మండల కేంద్రంతో పాటు బాబాసాగర్, బాలాజీఅన్‌కోడ తదితర గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ త మ బ్యాలెట్ గుర్తులను చూపిస్తూ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యకర్తలు నీలాగౌడ్, తోంబ్రె మారుతి, రామాగౌడ్, విష్నేష్, కోటేష్, తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles