ముగిసిన నామినేషన్లు

Sat,January 19, 2019 12:06 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భా గంగా ఐదు మండలాల్లో నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ముగిసింది. ఆఖరి రోజు కావడంతో, అభ్యర్థు లు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్-యు, వాం కిడి మండలాల్లోని 114 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. గత రెండు రోజుల్లో సర్పంచ్ స్థానానికి 123 నామినేషన్లు అం దాయి. మూడో విడుతలోని 114 పంచాయతీలకు 448 నామినేషన్లు రాగా, వార్డు సభ్యులకోసం 1337 వచ్చాయి. కాగా 17 గ్రామ పంచాయితీలు ఏ కగ్రీవమయ్యాయి.
పోటాపోటీగా నామినేషన్లు
ఆసిఫాబాద్ డివిజన్ జైనూర్, కెరమెరి, లిం గాపూర్, సిర్పూర్-యు, కెరమెరి మండలాల్లోని 114 గ్రామ పంచాయతీల్లో 17గ్రామాలు ఏక గ్రీవం కాగా, మిగతా 97 పంచాయతీలకోసం 448 నామినేషన్లు వచ్చాయి. 928 వా ర్డులకు 1337 నామినేషన్లు అందాయి. వాంకిడి మండలంలో సర్పంచ్ కోసం 135, వార్డులకు 361, జైనూర్ మండలంలో సర్పంచ్ 109, వార్డులకు 311, సిర్పూర్-యు మండలంలో సర్పంచ్ 49 , వార్డులకు 165, లిం గాపూర్ మండలంలో సర్పంచ్ 45, వార్డుకు 12 8, కెరమెరి మండలంలో సర్పంచ్ 110, వా ర్డుల కు 372 నామినేషన్లు అందాయి.
17 పంచాయతీలు ఏక గ్రీవం
మూడవ విడుతలోని ఐదు మండలాల్లో 17 గ్రామ పంచాయితీలకు కేవలం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవం కానున్నాయి. జై నూర్ మండలంలోని మార్లవాయి, దుబ్బగూడ,పవార్ ఊషేగాం, పార గ్రామ పంచాయితీలు, కెరమెరి మండలంలోని ధనోర, బాబెఝరి, కరంజివాడ గ్రామ పంచాయితీలు, సిర్పూర్-యు మండలంలోని సీతాగొంది, బాండేర్ పంచాయితీలు, లింగాపూర్ మండలంలోని గుమ్నూర్(బి), చిన్నదంపూర్ గ్రామ పంచాయితీలు, వాంకిడి మండలంలోని సామెల, నవేగాం, లెండిగూ, దొడ్డిగూడ, పాటగూడ గ్రామ పంచాయితీలకు ఒక్కొటి చొప్పున నామినేష న్ మాత్రమే వచ్చింది.
చివరి రోజు వచ్చిన నామినేషన్లు
ఐదు మండలాల్లో కలిపి ఆఖరి రోజు శుక్రవారం సర్పంచ్ 325, వార్డులకు 1167 నామినేషన్లు అందాయి. జైనూర్ మండలంలో సర్పంచ్ 79, వార్డు స్థానాలకు 268 మంది నామినేషన్లు దాఖలు చేశారు. లింగాపూర్ మండలంలోని అన్ని పంచాయతీలకు శుక్రవారం సర్పంచ్ 45, వార్డు స్థానాలకు 128 నామినేషన్లు అందాయి. సిర్పూర్(యు) మం డలంలోని 15 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 49, వార్డులకు 165 నామినేషన్లు దాఖాలయ్యాయి. వాంకిడి మండలంలో సర్పంచ్ , వార్డులకు 298 అందినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం తో నామినేషన్ల స్వీకరణ ముగియడంతో, శనివారం నామినేషన్లను పరిశీలించనున్నారు. 21,22 తేదీల్లో అప్పీలుకు అవకాశం, పరిష్కారం, 30 న ఎన్నికలు నిర్వహించనున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles