చివరి రోజు..నామినేషన్ల జోరు

Sat,January 19, 2019 12:04 AM

జైనూర్: మూడు రోజులుగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం శుక్రవారం ముగిసింది. మండలంలోని 26 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 79, వార్డు స్థానాలకు 268 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని ఎంపీడీవో బానొవత్ దత్తరాం తెలిపారు. మూడు రోజుల్లో సర్పంచ్ 101, వార్డు స్థానాలకు 311 నామినేషన్లు వచ్చాయని పేర్కొన్నారు.
లింగాపూర్: మండలంలోని అన్ని పంచాయతీలకు శుక్రవారం సర్పంచ్ 45, వార్డుస్థానాలకు 128 నామినేషన్లు వచ్చాయని ఎంపీడీవో శశికళఠాగూర్ తెలిపారు. లింగాపూర్ క్లస్టర్ సర్పంచ్ -36, వార్డు స్థానాలకు-95, కంచన్ క్లస్టర్ సర్పంచ్-9, వార్డు స్థానాలకు-33 నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. మూడు రోజుల్లో సర్పం చ్ 60, వార్డు స్థానాలకు- 182 నామినేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
సిర్పూర్(యు): మండలంలోని 15 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 49, వార్డులకు 165 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా బాండేర్, సీతాగోంది గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, మొత్తం 16 వార్డులకు ఒక్కో నామినేషన్ మాత్రమే వేయడంతో ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానాలకు సిర్పూర్ -2, రాఘపూర్ భుర్నూర్ శెట్టిహడ్పునూర్ కోహినూర్ బాండేయేర్ మహగాంలో-4, పంగిడిలో-3, పుల్లారలో-6, నేట్నూర్ దనోరలో-3, పాములవాడలో-2, పవర్ బాబ్జిపేట్-2, సీతగోంది-1 నామినేషన్లు దాఖలయ్యాయి.
వాంకిడి: మండలంలో 28 గ్రామ పంచాయతీలకు చివరి రోజు సర్పంచ్ 79, 236 వార్డులకు 298 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి మహేందర్ తెలిపారు. మూడు రోజుల్లో మొత్తం సర్పంచ్ 135, వార్డులకు 361 నామినేషన్లు దాఖలైనట్లు ఆయన పేర్కొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles