విదేశీ విద్యకు ఆర్థిక భరోసా

Sat,January 19, 2019 12:03 AM

ఆసిఫాబాద్,నమస్తే తెలంగాణ: విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి విధ్యానిది పథకం ద్వారా సహాయం పొందాలనుకునే బీసీ విద్యార్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ ధరఖాస్తులను అహ్వానిస్తున్నట్లు ఆశాఖ జిల్లా ఆదికారి రాజేశ్వర్ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 16వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు దరఖాస్తుచేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా విదేశాలల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షల స్కాలర్ షిప్ పొందవచ్చాన్నారు. జిల్లాలో అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

1. తెలంగాణ రాష్ర్టానికి చెందిన వారై ఉండాలి
2. వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు అర్హులు.
3. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి
4. విదేశాల్లో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవచ్చు.( మొదటి సంవత్సరం ఆన్ దరఖాస్తు చేయ్యని వారు)
5. అన్ని వనరులు కలుపుకొని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించి ఉండకూడదు.
6. అభ్యర్థులు విదేశీ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యూయేషన్, పీహెచ్ కోర్సులు చేయుటకు ఆర్హులు.
7. పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్ చేసే అభ్యర్థులు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
8. టోఫెల్/ ఐఈఎల్ ఐఈఎల్ ఎస్-60. జీఆర్ జీమాట్-500. పీటీఈ-50 కనీసం స్కోర్ కలిగి ఉండాలి
9. ఈ దరఖాస్తులను బీసీ సంక్షేమ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీ పరిశీలించి ఎంపిక ప్రకటన చేస్తుంది.
10. విదేశీ విశ్వ విద్యాలయం నుంచి ఆడ్మిషన్ ఆఫర్ లెటర్( ఐ-20 లెట ర్ ఆఫ్ ఆడ్మిషన్ లేద తత్సమానం) పొందియుండాలి.
11.అభ్యర్థులు యుఎస్ యూకే, న్యూజిలాండ్, జర్మనీ, కెనడా, ఫ్రా న్స్, సింగపూర్, జపాన్, అస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాల్లో విద్యను అభ్యసించేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు hpp//telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ సందర్శించాలి.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles