దైవసాక్షిగా..

Thu,January 17, 2019 11:14 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగా ణ: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గురు వారం ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రొటెం స్పీకర్ ఎదుట ప్రమాణం చేశా రు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనప్ప మూడోసారి గెలిచి అసెంబ్లీ లో అడుగుపెట్ట గా, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు రెండోసారి విజయం సాధించి ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే కోనప్ప హైదరాబా ద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివా ళులర్పించారు. ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ ఈ సంద ర్భంగా అభినందించారు. అనంతరం వారు నమస్తే తెలంగాణతో తమ భావాలను పంచుకున్నారు.

అందుబాటులో ఉండి సేవలందిస్తా : ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సిర్పూరు నియో జకవర్గ ఎమ్మెల్యేగా మూడోసారి గెలి పించిన ప్రజలకు నా తుది శ్వాస వర కు సేవలందిస్తా. అందరి సహకారం తో నియోజకవర్గ అ భివృద్ధే ధ్యేయంగా పని చేస్తా. సీఎం కేసీఆర్ సార్‌కు సిర్పూరు ని యోజకవర్గంపై పూర్తి అవగాహన ఉంది. ప్రతీ మండలానికి ఏం కావాలన్నా తెలిసిన నాయకు డు, సిర్పూరుకే సిరి అయిన పేపరు మి ల్లును తెరిపించిన నాయకుడు కేసీఆర్. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అ భివృద్ధి సంక్షేమ పథకాలు నియోజకవర్గ ప్రజ లకు అందేలా అహర్నిశలు కృషి చేస్తా. అసెంబ్లీలో మూడోసారి అడుగుపెట్టడం ఎంతో సంతోషాన్నిచ్చింది.

స్వరాష్ట్రంలో తొలిసారి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది..: ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ప్రత్యేక రాష్ట్రం లో తొలిసారి ఎమ్మెల్యే గా అడుగు పెట్టడం సంతోషాన్నిచ్చింది. అంసెబ్లీలో రెండవ సారి ఆసీఫాబాద్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాను. మొదటి సారి సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో చేశాను. ఇ ప్పుడు రెండవ సారి తెలంగాణ ప్రత్యేక రా ష్ట్రంలో తొలిసారి ప్రమాణం చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఆసిఫాబాద్ ప్రజ లు మరోసారి ఎమ్మెల్యేగా నాకు ఇచ్చిన అవ కాశాన్ని సధ్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తా. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభి వృద్ధి చేస్తా.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles