చిరుత మృతిపై విచారణ..

Thu,January 17, 2019 11:13 PM

(మంచిర్యాల ప్రతినిధి, నమస్తే తెలంగాణ) మంచిర్యాల మండలం రంగపేటలో చిరుత మృ తికి అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నది. కోటపల్లి, వేమనపల్లి, జైపూర్, భీమారం, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట నిరంతరంగా కొనసాగుతోంది. వేటగాళ్లు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చి వేటాడుతుంటారు. ఎప్పుడైనా సమాచారం వస్తే ఆ వేట మాంసాన్ని పట్టుకోవడం తప్ప వారిపై చర్యలు తీసుకోవడం లేదు. దీనితో వేటగాళ్లు సైతం తమ పని తాము యథేచ్ఛగా చేసుకుపోతున్నారు. విద్యుత్ తీగ లు అమర్చి వన్యప్రాణులను వేటాడటంపై గ్రామీణ ప్రాంతాలలో అవగాహన కల్పిస్తే తప్ప అది నిర్మూలన సాధ్యం కాదని పలువురు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటే వేటా ఆగే పరిస్థితులు కనినపించడం లేదు. దీనిపై నిర్ధిష్ట ప్రణాళిక లేకపోవడంతో వన్యప్రాణుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మంచిర్యాల మండలం రంగపేటలో సైతం చిరుత మృతి ఇలాంటిదే.వన్యప్రాణులు చనిపోతున్నా కప్పి పెడుతున్నారు...

కొందరు అధికారులైతే వన్యప్రాణులు చనిపోతున్న విషయాన్ని కూడా దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ చనిపోయిన విషయం బ యటకు వస్తే తమ మెడకు చుట్టుకుంటుందని కొం దరు అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఆరు నెలల కిందట ఏసీసీ క్వారీ గుంతలోప డి అడవి దున్న ఒకటి చనిపోయింది. విషయం బ యటకు పొక్కితే ఇబ్బందులుంటాయని అధికారులు అక్కడే పోస్టుమార్టం చేసి ఖననం చేశారు. ఇది ఒకటే కాకుండా చాలా ప్రాంతాల్లో నీలుగాయి, దుప్పులు చనిపోతున్నా ఆ విషయాన్ని బయటకు రాకుండా చూస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకొని వదిలేస్తున్నారు.

మరో చిరుత మృతిపైనా దర్యాప్తు...
మంచిర్యాల ఏరియాలోని రంగపేటలో ఉచ్చుకు పడి చనిపోయిన చిరుత వ్యవహారం బయటకు పొక్కడంతో అధికారులు దానిపై విచారణ చేపట్టి ఆరుగురిని అరెస్టు చేశారు. అయితే పది రోజుల కిందట మరో చిరుత కూడా మృతి చెందిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ చిరుతను అదే ప్రాంతంలో కొందరు వేటగాళ్లు చంపి చర్మం, గోర్లు తీసుకొని శవాన్ని పాతి పెట్టారని ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ఫారెస్టు అధికారులు విచారణ చేపట్టారు. డాగ్ స్కాడ్‌తో అటవీ ప్రాంతంలో పలుచోట్ల గాలించారు. అయితే అది నిజం కాదని ఫారెస్టు అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. అయినా విచారణ కొనసాగిస్తామని మరోమారు వెల్లడించారు.

ఆరుగురిని అరెస్టు చేసిన ఫారెస్టు అధికారులు...
రంగపేటలో చిరుత పులి మృతి కేసులో ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు అటవీ శాఖాధికారులు స్పష్టం చేశారు. దూల శ్రీనివాస్, గుర్రం నగేశ్, బండి సంపత్, జంబి సంపత్, తోల్క సురేశ్, దూల వెంకటేశ్‌ను అరెస్టు చేసినట్లు ఫారెస్టు అధికారులు వెల్లడించారు. కిలో వన్య ప్రాణుల మాంసం పట్టుపడితేనే నానా హడావుడి చేసే అధికారులు చిరుత చనిపోయినా కానీ, నిందితుల అరెస్టు విషయంలో గాని మీడియా సమావేశం ఏర్పాటు చే యకపోవడం గమనార్హం. కేవలం విలేకరులకు ప్రకటనలు పంపి చేతులు దులుపుకున్నారు. దీంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles