ఇంద్రవెల్లి (ఆదిలాబాద్ జిల్లా ) : వచ్చే నెల 4న నాగోబాకు మహాపూజల కోసం గంగాజల సేకరణకు బుధవారం సాయంత్రం మెస్రం వంశీయుల పీ ఠాధిపతి మెస్రం వెం కట్రావ్పటేల్ ఆధ్వర్యంలో కెస్లాపూర్ నుంచి పాదయాత్రగా బయల్దేరిన మె స్రం వంశీయులు గురువారం ఉట్నూర్ మండలంలోని సాలేవాడకు చేరుకున్నారు. బుధవారం రాత్రి మండలంలోని ముత్నూర్ గ్రామపోలిమేర లో బసచేశారు. ఉద యం ముత్నూర్ గ్రామస్తులతోపాటు మెస్రం వం శీయుల ఆధ్వర్యంలో ఝరి కి పురుషులు, మహిళలు వేర్వేరుగా పూజలు నిర్వహించారు. అనంతరం ముత్నూర్ గ్రామస్తుల ఆ ధ్వర్యంలో సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేశా రు. సాయంత్రం ఉట్నూర్ మండలంలోని సాలే వాడకు చేరుకోగా గ్రామస్తులు ఊరి పొలిమేరలో సంప్రదాయ ప్రకారం ఆహ్వానించి రాత్రి బసచేసేందుకు ఏర్పాట్లు చేశారు. మెస్రం వంశీయులు కటోడ హనుమంత్రావ్, కోసు కటోడ, పర్ధాంజీ పాండురంగ్, తుకుడోజీ, గణపతి, దాదారావ్, తిరుపతి, పోల్లు, దేవ్రావ్, భీమ్రావ్, ధ ర్ము, ప్రభు, జంగు, మెస్రం వంశీయులు ఉన్నారు.