ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Thu,January 17, 2019 11:12 PM

సిర్పూర్(టి) : గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సహకరించాలని ఎస్పీ మల్లారెడ్డి కోరారు. గురువారం మండలంలోని పారిగాం గ్రామంలో పర్యటించి, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి గొడవలకు వెళ్లకుండా ఓటింగ్‌లో పాల్గొనాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆయన వెంట కాగజ్‌నగర్ డీఎస్పీ సాంబయ్య, కౌటల సీఐ మోహన్, సిర్పూర్(టి) ఎస్‌ఐ గంగన్న, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

కౌటాల: మండలంలోని ముత్తంపేట గ్రామస్తులతో ఎస్పీ మల్లారెడ్డి మాట్లాడారు. ఎన్నికల వేల ఓటర్లను మభ్యపరుచుకునేందుకు అభ్యర్థులు మ ద్యం, డబ్బులు పంపిణీ చేస్తారని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కౌటాల ఎస్‌ఐ ఆంజనేయులు, ఏఎస్‌ఐ హన్మండ్లు, పోలీసులున్నారు.

చింతలమానేపల్లి :మండలంలోని రుద్రాపూర్ పో లింగ్ కేంద్రాన్ని గురువారం ఎస్పీ మల్లారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ని ర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అక్రమంగా మద్యం, గు డుంబాను విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు.

పెంచికల్‌పేట్: మండలంలోని లోడ్‌పల్లిలో ఎస్పీ మల్లారెడ్డి గురువారం సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు హక్కు చాల విలువైందనీ, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వ చ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిం చారు. అనుమానితులు సంచరిస్తే వెంటనే 100 కు డయల్ చేయాలన్నారు. సీఐ వెంకటేశ్వర్లు , ఎస్‌ఐ రమేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles