ప్రమాదవశాత్తు ఇళ్లు దగ్ధం

Thu,January 17, 2019 02:11 AM

దహెగాం: మండలంలోని బ్రహ్మన్‌చిచ్చాలలో కంబగౌని విజయలక్ష్మి చెందిన ఇళ్లు మంగళవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమైంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్న సమయంలో ఇంటికి నిప్పంటుకొని ఒకసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికుల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్లు కాలిపోవడంతో విజయలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కోనేరు ట్రస్టు ద్వారా సాయం
ఇళ్లు కాలిపోయిన కంబగౌని విజయలక్ష్మి కుటుంబానికి మంగళవారం కోనేరు ట్రస్టు ద్వారా నిత్యావసర సరుకులు అందజేశారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలలకు సరపడ బియ్యం, పప్పులు, ఇంతర వంట సామగ్రిని అందించారు. అదే విధంగా దుస్తులు, దుప్పట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కొండ్ర అన్నపూర్ణ, కాగజ్‌నగర్ కౌన్సిలర్ రాచకొండ గిరీశ్, తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles