సర్కారు వైద్యంతో క్షయ నివారణ


Fri,November 16, 2018 11:23 PM

బెజ్జూర్: సర్కారు వైద్యంతో భయంకరమైన క్షయ నివారణ సాధ్యమని రాష్ట్ర ప్రత్యేక బృందం సభ్యులు తెలిపారు. మండల కేంద్రంలో క్షయ నివారణపై ప్రత్యేక క్యాంప్‌ను శుక్రవారం వారు ప్రారంభించారు. క్షయ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా ఈశిబిరంలో మండలంలోని 170 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. క్షయ బాధితులకు దవాఖానల్లో ఉచిత చికిత్స అందించనున్నట్లు తెలిపారు.వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 500 చొప్పున ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేస్తోంద న్నారు. మండల కేంద్రంలో శిబిరం నిర్వహించి, పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో క్షయ నిర్ధార ణ బృందం సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్ వైజర్లు ప్రమోద్, గంగాధర్, సీనియర్ టీబీ సూపర్ వైజర్ అబ్దుల్ ఖాదర్, బెజ్జూర్ పీహెచ్‌సీ హెచ్‌వీ రేణుక, ల్యాబ్ టెక్నీషియన్ దిలీప్, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

118
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...